రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు నియోజక వర్గాల వారీగా సమస్యాత్మక , హేతుబద్ధీకరణ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం లో రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నివేదిక అందజేయ్యాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత అదేశించారు.
మంగళవారం కలక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఏడు నియోజక వర్గాల రిటర్నింగ్, సహయ రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడివో లతో వలనారబుల్, రేషనలైజేషన్ పొలింగ్ కేంద్రాలు , ఫారం 6 , 7 , 8 పరిష్కార స్థాయి తదితర అంశాలపై జూమ్ కాన్ఫరేన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 1569 పొలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. వాటిలో ఓటరు జాబితా అనుగుణంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకణ పై నివేదిక అందజేయ్యాలని కోరారు. 1500 పై బడి ఓటర్లు , ఓటర్ల నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాల కు తగిన కారణాలు తెలియ చేస్తూ ప్రతిపాదనలు పంపాలని అన్నారు.
క్షేత్ర స్థాయిలో పర్యటించి వల్నరబిలిటీ , సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చెయ్యాలని మాధవీలత తెలియ చేశారు. రాజానగరం నియోజక వర్గంలో 216 పోలింగ్ కేంద్రాలకు గానూ 10 వల్నరబిలిటీ పోలింగ్ కేంద్రాలు , 50 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గా గుర్తించడం జరిగిందన్నారు. రాజానగరం నియోజక వర్గ పరిధిలో ఆయా పోలీంగ్ కేంద్రాలను నిర్థారణ చేస్తూ నివేదిక అందచేశారని పేర్కొన్నారు. మిగిలిన ఆరు నియోజక వర్గాల పరిధిలో కూడా ఆమేరకు తనిఖీలు నిర్వహించి సంపూర్ణ నివేదికలు పంపించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు అనపర్తి నియోజక వర్గంలో 228 పోలింగ్ కేంద్రాలలో 67 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తించడం జరిగిందన్నారు. రాజమండ్రీ సిటీ నియోజక వర్గంలో 232 పోలింగ్ కేంద్రాలకు గానూ 13 వల్నరబిలిటీ పోలింగ్ కేంద్రాలు , 36 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తించడం జరిగిందన్నారు. రాజమండ్రీ రూరల్ నియోజక వర్గంలో 264 పోలింగ్ కేంద్రాలకు గానూ 7 వల్నరబిలిటీ పోలింగ్ కేంద్రాల , 15 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తించడం జరిగిందన్నారు. కొవ్వూరు (ఎస్ సీ) నియోజక వర్గంలో 176 పోలింగ్ కేంద్రాలలో 35 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తించడం జరిగిందన్నారు. నిడదవోలు నియోజక వర్గంలో 205 పోలింగ్ కేంద్రాలలో 41 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తించడం జరిగిందన్నారు. గోపాలపురం (ఎస్ సీ)నియోజక వర్గంలో 248 పోలింగ్ కేంద్రాలలో 62 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తించడం జరిగిందన్నారు. మరోసారి క్షేత్ర స్థాయిలో పర్యటించి నిర్దారణ చేసి నివేదిక అందజేయ్యాలని స్పష్టం చేశారు.
అనంతరంఫిబ్రవరి 27 నాటికి ఓటరు జాబితా నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపు పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గత 45 రోజుల నుంచీ 9789 ఫారం 6 , 6 ఏ, 7 , 8 పెండింగులో ఉండగా వాటిలో 3,185 పరిష్కారము చేశారని, మిగిలిన 6,604 ను కూడా సత్వరం పరిష్కారము చెయ్యాలన్నారు. వాటిలో 45 రోజులు పైబడి ఉన్న 458 దరఖాస్తులు , 30 రోజులు పైబడి ఉన్న 649 దరఖాస్తులు, 15 రోజులు పైబడి ఉన్న 3184 పై మీ మీ లాగిన్ ల ద్వారా పరిష్కారము చెయ్యాలని, అదేవిధంగా 7 రోజులు దాటినా 2314 దరఖాస్తులు , 7 రోజుల లోబడి వచ్చిన 3185 దరఖాస్తులను పరిష్కారము చేసే విధానం లో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనీ పేర్కొన్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న దృష్ట్యా ఓటరు జాబితా కి సంబందించి వస్తున్న దరఖాస్తులను ఎప్పటి కప్పుడు పరిష్కరించడం చాలా ముఖ్యం అన్నారు. ఓట్ల తొలగింపు విషయంలో మరణించిన వారి కి చెందిన డెత్ సర్టిఫికెట్ నిర్దారణ చేసుకోవడం, చిరునామా మార్పు తగిన పత్రాలు స్వీకరించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని, ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలి అని మాధవీలత పేర్కొన్నారు.
అనంతరం ఓటరు జాబితా నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపు పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గత 45 రోజుల నుంచీ 9789 ఫారం 6 , 6 ఏ, 7 , 8 పెండింగులో ఉండగా వాటిలో 3,185 పరిష్కారము చేశారని, మిగిలిన 6,604 ను కూడా సత్వరం పరిష్కారము చెయ్యాలన్నారు. వాటిలో 45 రోజులు పైబడి ఉన్న 458 దరఖాస్తులు , 30 రోజులు పైబడి ఉన్న 649 దరఖాస్తులు, 15 రోజులు పైబడి ఉన్న 3184 పై మీ మీ లాగిన్ ల ద్వారా పరిష్కారము చెయ్యాలని, అదేవిధంగా 7 రోజులు దాటినా 2314 దరఖాస్తులు , 7 రోజుల లోబడి వచ్చిన 3185 దరఖాస్తులను పరిష్కారము చేసే విధానం లో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనీ పేర్కొన్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న దృష్ట్యా ఓటరు జాబితా కి సంబందించి వస్తున్న దరఖాస్తులను ఎప్పటి కప్పుడు పరిష్కరించడం చాలా ముఖ్యం అన్నారు. ఓట్ల తొలగింపు విషయంలో మరణించిన వారి కి చెందిన డెత్ సర్టిఫికెట్ నిర్దారణ చేసుకోవడం, చిరునామా మార్పు తగిన పత్రాలు స్వీకరించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని, ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలి అని మాధవీలత పేర్కొన్నారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, పార్లమెంట్ నియోజక వర్గ సహాయ ఆర్ వో ఆర్. కృష్ణ నాయక్, డీ టి సునీల్ పాల్గొనగా, జామ్ కాన్ఫరేన్సు లో జేసి తేజ్ భరత్, మునిసిపల్ కమీషనర్ దినేశ్ కుమార్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఇతర ఆర్వో లు పాల్గొన్నారు.