Breaking News

జాతీయ ఇమ్యునైజేషన్ డే పురష్కరించుకుని పల్స్ పోలియో కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఇమ్యునైజేషన్ డే (ది: 03-03-2024 తేదిన) పురష్కరించుకుని జరిగే పల్స్ పోలియో కార్యక్రమం లో 0-5 సంవత్సరాలు పిల్లలు అందరికి పోలియో చుక్కలు లక్ష్యం తో జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఎస్ డీల్లీరావు  ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం సుహాసిని అధ్వర్యంలో జిల్లా వ్యాధినిరోధక టీకాలు కార్యక్రమం అధికారి డాక్టర్ అమృత పట్టణ ప్రాంత వైద్యాధికారులకు మరియు కమ్యూనిటీ ఆర్గనైజర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఛాంబర్లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి మరియు హై రిస్క్ ఏరియాలో నివసించే కుటుంబంలలో‌0-5 సంవత్సరాలు పిల్లలు అందరికి పోలియో చుక్కలు వేయించాలని,అందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి అని ,ఏ ఒక్క అర్హులైన బిడ్డ కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా ఉండరాదని అనే లక్ష్యం తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది.వైధ్యధికారులు మరియు కమ్యూనిటీ ఆర్గనైజర్లు విధిగా హై రిస్క్ ఏరియాలు గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోని విధిగా ఆ ప్రాంతంలోని 0-5 సంవత్సరాలు పిల్లలు అందరికి పోలియో చుక్కలు వేయాలి అని తెలియజేసినారు.ఈ కార్యక్రమం లో WHO ప్రతినిధి డాక్టర్ రాఘవేంద్ర పాటిల్,పట్టణ ఆరోగ్య కేంద్రం వైధ్యధికారులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *