Breaking News

రానున్న ఎన్నికల్లో గళం విప్పనున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీన తరుపున అన్ని పార్లమెంట్‌ స్థానాలలో పోటీచేసి దమ్మున్నోళ్లను పంపించటానికి ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేడా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీలను, పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ను, 300/- వంటగ్యాస్‌ సిలెండర్‌ను, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం కాకుండాను, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని యుద్ద ప్రాతి ప్రదికన సాధన కోసం, 12 ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కై 50% శాతం వాటాను మా పార్టీ పోటీ దారులు సాధించి ఆంధ్రప్రదేశ్‌ను సంపన్న రాష్ట్రంగా అభివృద్ధి చేయటమే ప్రధాన లక్ష్యంగా పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలబడుతున్నారన్నారు. రాష్ట్రంలో వ్యాపార రాజకీయ పార్టీలను సాగనంపి అన్ని రంగాల్లో గొప్ప ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ధేయ్యం అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి సిద్ధం చేస్తున్నాం ఇందుకోసం స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్‌ వాదులు, రాజకీయ పార్టీలు ఉద్యమ సంస్థలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువతీ యువకులు, రాజకీయ కూటమికి బాసటగా నిలవాలన్నారు. రాష్ట్రం పై నిరంతరం విషం కక్కుతున్న బిజెపికి భజన చేస్తున్న కొన్ని పార్టీలకు చెంపపెట్టు వంటి తీర్పు నివ్వాలని పిలుపు నిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అధ్యక్షులు పెళ్ళకూరు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, జగన్‌ పార్టీలు పాలనకు అనర్హులని, కోర్టు వివాదంలో వున్న గాజు గ్లాస్‌ గుర్తు ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుందనే నమ్మకం మా కూటమికి వుందని, త్వరలో మా రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల సాధన సమితి కన్వీనర్‌ బూసిం వై.వి.సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భద్రత, ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ ఇతర రాష్ట్ర హక్కుల సాధన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌తోనే సాధ్యం అని ఆశాభావం వ్యక్తం చేసారు. అనంతరం మొదట విడతగా 5 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్‌ పెండ్యాల కామరాజు, లంక దుర్గా ప్రసాద్‌, సిమ్మా దుర్గారావు, బూసిం రమణమ్మ, పల్లా నూకరత్నం, మాడుగుల నాగ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *