అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ.. అక్టోబర్-డిసెంబర్, 2023 త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 708.68 కోట్లను నేడే (01.03.2024) కృష్ణా జిల్లా, పామర్రులో బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన క్రింద నేడు అందిస్తున్న రూ.708.68 కోట్లతో కలిపి ఇప్పటి వరకు విద్యా దీవెన, వసతి దీవెనల క్రింద మన ప్రభుత్వం చేసిన, చేస్తున్న వ్యయం మొత్తంగా రూ.18,002 కోట్లు.
‘జగనన్న విద్యా దీవెన’
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసెన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇస్తూ, తల్లులు, విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ.
‘జగనన్న వసతి దీవెన’
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరం (జూలై-జూన్) మొదట్లో మరియు చివర్లో ప్రతి ఏప్రిల్లోనూ ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తూ రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున రెండు విడతల్లో ప్రతి ఏప్రిల్ లో ఆర్థిక సాయం.. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ.. తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ.
ఈ 57 నెలల కాలంలో కేవలం విద్యా రంగ సంస్కరణలపై ప్రభుత్వం చేసిన, చేస్తున్న వ్యయం అక్షరాలా రూ. 72,919 కోట్లు.
రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో 93 శాతం మంది విద్యార్థులు “విద్యా దీవెన” ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకుంటూ చదువుకుంటున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం చదువులను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తుందో ఇట్టే గమనించవచ్చు.