తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు -2024 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అధ్వర్యంలో గత నెల ఫిబ్రవరి27 వ తేదిన తిరుపతి గవర్నమెంట్ హై స్కూల్ లో విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, 28 వ తేదిన పిచ్చటూరు జడ్పీ హైస్కూల్ నందు క్విజ్ ద్వారా ఆర్థిక అక్షరాస్యత పై కాంపిటేషన్ నిర్వహించడం జరిగింది . ఈ విభాగాల పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు మొదటి, రెండవ మరియు మూడవ క్యాటగిరి కింద సర్టిఫికెట్స్ తో పాటు ప్రైజ్ మనీ ని నేటి శుక్రవారం నాడు జిల్లా కలెక్టరేట్ నందు కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ అందజేసారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక కమిషనర్ అదితి సింగ్, లీడ్ బ్యాంకు మేనేజర్ సుభాష్, సమగ్ర శిక్ష సి ఎం ఓ సురేష్, జడ్పీ హైస్కూల్ పిచ్చటూరు ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి, వెంకటేశ్వర్లు, తిరుపతి గర్ల్స్ హై స్కూల్ హెడ్మాస్టర్ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News