-పథకం ద్వారా త్రైమాసికంలో 33,602 మందికి రూ. 31.72 కోట్ల లబ్ధి..
-ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యకు పేదరికం అడ్డుకాకుడదన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అందించే పూర్తి ఫీజు రీయంబర్సుమెంట్ తో ప్రతీ విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
2023, అక్టోబర్`నవంబర్`డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణాజిల్లాలోని పామర్రులో శుక్రవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన జిల్లాస్థాయి కార్యక్రమం కలెక్టరేట్ వీసీ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, నగర్ మేయర్ రాయన బాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు, వివిధ కార్పోరేట్ చైర్మన్‌లతో కలిసి విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన చెక్కు అందజేశారు.
అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోను అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో నాడు`నేడు పథకాన్ని అమలు చేయడం ద్వారా పాఠశాలల రూపురేఖలనే మార్చివేయడం జరిగిందన్నారు. అత్యాధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేసి ప్రాధమిక విద్య నుండే శ్రాస్త సాంకేతిక పరిజ్ఞానం మెరుగు పరచడం ద్వారా విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. నిరుపేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు పేదరికం అడ్డురాకూడదనే దృడ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్ట్టి సారిస్తున్నారన్నారు. జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద వంటి పథకాలను అమలు చేయడం ద్వారా ప్రతీ పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఐటిఐ, డిప్లమా, డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి విద్యా దీవెన పథకం సువర్ణ అవకాశం లాంటిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో చదివే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రీయంబర్సుమెంట్‌ను నేరుగా తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, బిఇడి, అగ్రికల్చర్, మెడికల్, నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న 37,178 మంది విద్యార్థులకు 31.72 కోట్ల రూపాయలను 33,602 మంది తల్లుల ఖాతాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారన్నారు. తల్లుల ఖాతాలలో జమ అయిన సొమ్మును వెంటనే కళాశాలలకు చెల్లించాలని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
కార్యక్రమంలో డిప్యూటి మేయర్లు ఆవుతు శ్రీ శైలజారెడ్డి, బెల్లం దుర్గా, జిల్లా వక్ఫ్‌బోర్డు అధ్యక్షులు షేక్ గౌస్ మొహిద్దీన్, భట్రాజ్ కార్పోరేషన్ చైర్‌పర్సన్ కూరపాటి గీతాంజలి, జైన్ కార్పోరేషన్ చైర్మన్ మనోజ్ కోఠారి, సాంఫీుక సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ బి. వి.విజయభారతి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ కిరణ్మయి, డ్వామా పిడి జె. సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News