రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జా తీయ మహిళా దినోత్సవము పురస్కరించుకొని ది 07.03.2024వ తేదీన స్దానిక ప్రభుత్వ సామాన్య బోధనా వైద్యశాల (GGTH) రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నందు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి ఆదేశానుసారం ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) మరియు ప్రభుత్వ సామాన్య బోధనా వైద్యశాల (GGTH) రాజమహేంద్రవరము నందు పనిచేయుచున్న ఉద్యోగిని (Female Employees) లకు గర్భాశయ, బ్రెస్ట్, నోటి కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించటము జరిగింది. ఈ కార్యక్రమమును స్థానిక వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. బి. సౌభాగ్య లక్ష్మి గారు మరియు మెడికల్ సూపరింటెండెంట్ జిజిహెచ్ డా.M.L. సూర్యప్రభ ఆధ్వర్యంలో జిజిహెచ్ లోగల సంబంధిత శాఖల అధిపతులు (HODs) లను సమన్వయ పరచి ఈ కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమమును కళాశాల కమ్మునిటీ మెడిసిన్ (Community Medicine ) విభాగపు సహాయ సహకారము (Coordination) తో నిర్వహించటము జరిగింది. ఈ కార్యక్రమము ఎంసిహెచ్ బ్లాక్ లో లాంఛనముగా ప్రారంభించటం జారింది. ఈ కార్యక్రమునకు అధ్యక్షత వహించిన డా. బి. సౌభాగ్య లక్ష్మి , వైద్య కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్త్రీలు అన్నీరంగాలలో ముందంజలో ఉంటున్నారని, వారికి మరింత చేయూతనిస్తూ వారి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకున్నప్పుడే స్త్రీ ఆర్ధిక, ఆరోగ్య స్వావలంబన సాధించ గలరని వివరిస్తూ నేడు కాన్సర్ అనేది చాప క్రింద నీరులా విస్తరిస్తూ చివరకు ప్రాణాలను బలితీసుకుంటోందని, దీనిని ముందుగానీ గుర్తిస్తే సులభముగా నయం చేసుకో వచ్చునని తెలిపినారు జిజిహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డా.ఎమ్ ఎల్ . సూర్యప్రభ మాట్లాడుతూ తొలిదశలో ఈ వ్యాధిని గుర్తిస్తే వెంటనే చికిత్స చేయించు కోవచ్చునని వివరిస్తూ ఈ రోజు ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కేంద్రం సేవలు అందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరములో కేన్సర్ నిర్ధారించుటకు గాను చేసే పాప్ స్మియర్, మామోగ్రఫి, బ్రెస్ట్ పరీక్ష అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ పరీక్ష నోటి కుహర పరీక్ష అసాంక్రమిత వ్యాధుల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలుపుతూ ప్రతీ ఫిమేల్ సిబ్బంది ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని హితవు పలికినారు. డి సి హెచ్ ఎస్ Dr. సనత్ కుమారి , మాట్లాడుతూ స్త్రీ ఉద్యోగినులు తమ ఉద్యోగ బాధ్యతలతో బాటు తమ వ్యక్తిగత ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపినారు. లక్ష్మి – నర్సింగ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగినులు ఈ స్క్రీనింగ్ సేవలను వియోగించుకోవాలని కోరి నారు. ఈ కార్యక్రమమును స్థానిక కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగపు HOD Dr V. Suryarao I/c మరియు సిబ్బంది ఇతర శాఖలతో సమన్వయము చేసి పెద్దసంఖ్యలో స్త్రీ ఉద్యోగులు పాల్గొనేటట్లు చేయుట జరిగినది. ఈ కార్యక్రమములో డా. అక్కమాంబ గైనికాలజీ విభాగపు అధిపతి డా హేమంతి సర్జరి విభాగపు అధిపతి, డా. ఏ. వెంకటలక్ష్మి, హెచ్డి పాథాలజీ, డా. నాగ వెంకట సమీరాజా సర్జీకల్ ఆంకాలజీ, డా. స్పందన రేడియేషన్ ఆంకాలజీ, డా. వై రామకృష్ణ జనరల్ మెడిసిన్, డా. సి ఎచ్ వి. సునీత దేవి డెర్మటాలజీ డా విశ్వనాథ్ డెంటల్ సర్జరి తదితరులు పాల్గొన్నారు. మొత్తము పరీక్షలు నిర్వహించిన సంఖ్య. -ఈ కార్యక్రమములో మహిళా దినో త్సవమును పురస్కరించుకొని విశిష్ట అతిధులకు సన్మానిచటం జరిగినది. ఈ కార్యక్రమములో జిజిహెచ్ మరియు వైద్య కళాశాల సిబ్బంది పెద్దయెత్తున పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …