రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అధ్యక్షతన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం క్రింద కార్మిక సంక్షేమ సమన్వయ కమిటీ సమావేశం కలక్టరేట్ లో స్పందన హాల్ నందు తేదీ 07.03.2024 సాయంత్రం జరిగినది. ఈ సమావేశమునకు వివిధ నిర్మాణ పనులు చేపట్టే ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, ప్లాన్ అప్రూవల్ అథారిటీస్ హాజరైనారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టము క్రింద, ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ భవన మరియు ఇతర నిర్మాణాల మీద 1% సెస్ చెల్లించవలసి ఉన్నదన్నారు . కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలకు, నిర్మాణ వ్యయం మీద 1% సెస్ ను ఆయా శాఖలు: అలాగే ప్రైవేట్ నిర్మాణాల మీద సెస్ ని ప్లాన్ అప్రూవల్ అథారిటీలైన మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ప్లాన్ అప్రూవల్ సమయములో వసూలు చేసి ఆంధ్ర ప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కు జమచేసి వాటి పూర్తి వివరాలను బోర్డుకు కార్మిక శాఖకు నెలవారీ నివేదికను మరియు యాన్యూవల్ రెటర్న్ లను పంపవలసి ఉన్నది. 2014 నుండి ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణ పనుల వివరములు, వసూలుచేసిన సెస్ మొత్తము, జమచేసిన వివరములు తెలుపుతూ నివేదికలను ప్రతి శాఖ మరియు ప్రభుత్వ రంగ సంస్థ కార్మిక శాఖకు, బోర్డుకు నివేదికలను 10 రోజుల్లోగా పంపాలని జిల్లా కలెక్టరు మాధవీలత ఆదేశించారు. అలాగే నిర్మాణ ప్రదేశాల్లో కార్మికుల భద్రత కొరకు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టము, 1996 మరియు రూల్స్ 1998 చేసిన నిబంధనలను, ప్రమాణాలను ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టర్లు, యజమానులు, మరియు బిల్డర్లు తప్పనిసరిగా పాటించాల్సిందిగా జిల్లా కలక్టరు ఆదేశించారు. ఇప్పటివరకు సెస్ వివరాలు అందచేయని ప్రభుత్వ శాఖలు వారం రోజుల లోగ వివరాలు కార్మిక శాఖ కార్యాలమునకు అందచేయాలని ఈ సమావేశం నందు తెలియచేసారు. ఈ సమన్వయ సమావేశమునకు ఉప కార్మిక కమీషనర్, కాకినాడ పి. శ్రీనివాస్ , బి.ఎస్.ఎమ్.వలి పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …