Breaking News

ద్వారకా తిరుమల మండలంలో నేను సిద్ధం.. మా బూత్ సిద్ధం..కార్యక్రమం నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత

ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి నేను సిద్ధమని.. బూత్ స్థాయిలో తమ ఏజెంట్లు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలానికి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. బుధవారం రాత్రి స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఈ సమావేశం  నిర్వహించారు. ట్వంటీ ట్వంటీ ఫోర్.. జగనన్న వన్స్ మోర్ అని హోంమంత్రి తానేటి వనిత నినాదాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు లేకుండా అందరి బాధ్యతతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు కొన్ని జగనన్న ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నాయని, వాటిని ధైర్యంగా తిప్పికొట్టాలని ఏజెంట్లకు పలు సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ పరిశీలకులు గన్నమని వేంకటేశ్వరరావు (జీ వీ), మండల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *