విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రాజకీయ సమానత్వం కోసమే తామంతా పోరాటం చేస్తున్నామని ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ నేత నేతలు రామ్ కి , మేడా శ్రీనివాస్, నారగోని, పెళ్ళాకూరి సురేంద్ర రెడ్డి వార్లు పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ లు రాష్ట్ర ప్రతిష్టని, హక్కుల్ని సర్వనాశనం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని కేంద్రానికి, కార్పొరేట్ శక్తులకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్వీర్యం చేస్తున్నారని దీనికోసం కొన్ని చిన్న చిన్న పార్టీలతో కలిసి ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడ్డామని తెలిపారు .రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి, టిడిపి, బిజెపి లకు, ప్రత్యామ్నాయంగా ఒక మూడవ ప్రత్యేక రాజకీయ శక్తిని నిర్మించడానికి 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి ,అదేవిధంగా 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయడానికి ఒక కసరత్తు జరిగిందని, దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రూపొందించబోతున్నామని తెలిపారు. ఆశక్తి ఉన్న వాళ్ళు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా పనిచేసే వాళ్ళని తాము ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎక్కడ ఎవరు పోటీ చేయాలో ఖచ్చిత ప్రణాళికతో ఉన్నామన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకి గుణపాఠం చెప్పి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, ఆత్మగౌరాన్ని ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకుంటూ కేంద్రం నుంచి మనకు రావలసిన ప్రతి వాటాని కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల సాధించి తీరుతామాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 75 లక్ష ల కోట్ల రూపాయలు కేజీ బేసిన్ సంపద ఉందని, 33 లక్షల సంపదే ఉందంటూ తప్పుడు సాంకేతాలు ప్రచురించుట పచ్చి మోసం అని,ఈ సంపదని కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని, ఇవన్నీ కూడా కచ్చితంగా బహిర్గతం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ని ఒక సంపద రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు రాజ్యాధికారం సమానంగా పంపిణీ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం రెండు వర్గాలు రెండు రాజకీయ పార్టీలే పెత్తనం చేస్తూన్నాయని, దానిని మార్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ రాజకీయ సమానత్వం కోసం, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు రాజ్యాధికారాన్ని పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఓడించాల అనే ఉద్దేశంతోనే ఈ ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసామని అన్నారు. ఎన్నికలు నోటిఫికేషన్ ముందు మా మేనిఫెస్టోను విడుదల చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గరగపర్తి రామకృష్ణ (రామ్ కి ), రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షులు నారగోని, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్, రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీరంకి అయ్యన్న బాబు, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామ్మోహన్, జై ఆంధ్ర డెమొక్రటిక్ ఫోరం గౌరవ అధ్యక్షులు పెళ్ళకూరి సురేంద్రరెడ్డి,ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి ఫణిరాజ్, ఆంధ్ర హక్కుల సాధన సమితి నాయకులు బూసిం వై వి సత్యనారాయణ,కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు గిద్ద శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …