Breaking News

స్టెమ్ విద్యను బలోపేతం చేసి అనుభవాత్మక విద్యను అందించాలి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు
-సేవ్ ది చిల్డ్రన్, అగస్త్య ఫౌండేషన్ – కనెక్ట్ టు ఆంధ్రా సంస్థలతో సమగ్ర శిక్షా నాన్ ఫైనాన్షియల్ ఎంవోయూ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంచడానికి, ప్రస్తుత, రాబోయే పోటీ ప్రపంచంలో తమదైన ప్రగతిని చాటి చెప్పడానికి అనేక వినూత్న కార్యక్రమాలతో పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తుందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు.
గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సమగ్ర శిక్షా – కనెక్ట్ టు ఆంధ్రా, సేవ్ ది చిల్డ్రన్ (బాల్ రక్షా భారత్) ఉన్నత పాఠశాలల్లో స్టెమ్ ఆధారిత విద్యను బలోపేతం చేయడానికి, సాంకేతిక సహకారాన్ని అందించడానికి రాష్ట్రంలో నాన్ -ఫైనాన్సియల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆంగ్ల మాధ్యమం, టోఫెల్ శిక్షణలు, సీబీఎస్ఈ విధానంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం మెరుగైన, నాణ్యమైన విద్యను అందించి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు.
పాఠశాలల్లో స్టెమ్ ఆధారిత విద్య ద్వారా సైన్స్ , ఇంజనీరింగ్ , టెక్నాలజీ, మాథమెటిక్స్ వంటి కీలక సబ్జెక్టుల్లో అనుభవాత్మక విద్యను అందించడానికి సేవ్ ది చిల్డ్రన్ (బాల్ రక్షా భారత్ ), అగస్త్య ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉన్నత పాఠశాలల్లో స్టెమ్ లాబొరేటరీలను ఏర్పరచి విద్యార్థులను సాంకేతికంగా శాస్త్రీయ విధానంతో తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందులో భాగంగా ‘సేవ్ ది చిల్డ్రన్’ ద్వారా ఇప్పటికే 100 మోడల్ పాఠశాలల్లో స్టెమ్ లాబొరేటరీలను ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ కూడా అందించామన్నారు.
ఈ నేపథ్యంలో సమగ్ర శిక్షాతో స్టెమ్ కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్న కనెక్ట్ టు ఆంధ్రా తో నాన్ -ఫైనాన్సియల్ భాగస్వామ్యానికి ఒప్పంద పత్రాలపై సమగ్ర శిక్షా, కనెక్ట్ టు ఆంధ్రా , సేవ్ ది చిల్డ్రన్ సంతకం చేసింది.
సమగ్ర శిక్షా, కనెక్ట్ టు ఆంధ్ర సహకారంతో ఏర్పాటు చేయనున్న దాదాపు 1000 స్టెమ్ ల్యాబ్ లకు సేవ్ ది చిల్డ్రన్, అగస్త్య ఫౌండేషన్ సాంకేతిక సహకారం అందించనున్నాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమగ్ర శిక్ష పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, కనెక్ట్ టు ఆంధ్రా డైరెక్టర్ కోట్ల శివ శంకర్, సేవ్ ది చిల్డ్రన్ (బాల్ రక్షా భారత్) డైరెక్టర్ అవినాష్ సింగ్, సౌత్ రీజినల్ అధికారి ఎన్.ఎం చంద్రశేఖర, సౌత్ ఇండియా ఎడ్యుకేషన్ లీడ్ శ్రీనగేష్ మల్లాడి తదితరులు హాజరయ్యారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *