-మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరం….ప్రజాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నిరుపమానం
-ప్రతి పనిలోనూ ప్రజా శ్రేయస్సు, ప్రతి పథకంలోనూ ప్రజా సంక్షేమమే… ప్రథమ ధ్యేయంగా ముందుకు సాగిన మహానేత వైయస్సార్…
-రాజన్న రాజ్యం నిర్మిస్తానని ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా నవరత్న పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్…
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు వై వంతెనపై శిధిలమైపోయిన విగ్రహ స్థానంలో, ఎమ్మెల్యే కొడాలి నాని తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన స్వర్గీయ వైయస్సార్ 12 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వేలాదిమంది ప్రజల సమక్షంలో పునర్ ఏర్పాటుచేసిన నిలువెత్తు వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించి, జోహార్ వైయస్ఆర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పాలంటే రాజన్న పాలనకు ముందు, తరువాత అని చెప్పటంలో అతిశయోక్తి లేదన్నారు. బడుగు, బలహిన వర్గాల ఆరాధ్య దైవం దివంగత వైయస్సార్, వెనుకబడిన వర్గాల, సమూహాల ఉద్ధరణ కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పరోపకారం, సేవాగుణం ఆయనను విశిష్టమూర్తిగా నిలబెడితే… ఇచ్చిన మాట తప్పకపోవటం, వేసిన అడుగు వెనక్కి తీసుకోకపోవటం ప్రజల హృదయాల్లో ఆయనను శిఖరాగ్రహణం నిలబెట్టిందన్నారు. వైఎస్సార్ ఆశీస్సులతో ప్రజల అండదండలతో 2019 ఎన్నికల్లో ఆయన వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారాన్ని చేపట్టారన్నారు.రాజన్న రాజ్యం నిర్మిస్తానని ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా సీఎం జగన్ నవరత్న పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. విగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి చంటి, మండల వైసీపీ కన్వీనర్ సాయన రవి, మండల యూత్ కన్వీనర్ గుదే రవి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పడమటి సుజాత, ఎంపీటీసీలు శీరం రాధాకృష్ణ వేణి, పెనుమాల పూర్ణ కవిత,మెరుగు నాగేంద్రం, ఈడే లక్ష్మి, చిన్నగోన్నూరు సర్పంచ్ కోటప్రోలు నాగు, చంద్రాల సర్పంచ్ కాలిశెట్టి అర్జున్, గాదెపూడి సర్పంచ్ వీర్నాల లక్ష్మణరావు, అంగలూరు సర్పంచ్ మేడేపల్లి రవికుమార్, డోకిపర్రు సర్పంచ్ గోసాల జ్యోతి, శ్రీ కొండలమ్మవారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ శేషం గోపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంట సురేష్, డాక్టర్ ఆర్కే, కనుమూరి రామిరెడ్డి, బలుసు జితేంద్ర, పామర్తి సత్యనారాయణ, పిన్నమనేని రాఘవేంద్ర, ముత్యాల రాజేష్, కొడాలి శివ, పోస్టల్ రాజు, గెరడా లక్ష్మి, పడమటి నాంచారయ్య, అల్లూరి ఆంజనేయులు, గాలంకి నాగేంద్ర, కుంచపర్తి సాయి, పెనుమాల రంగారావు, దోమతోటి గోపి, నందీశ్వర రావు, మహమ్మద్ భాష, గుండ్రెడ్డి కొండలరావు, ఈడే లక్ష్మణ, ఈడే వెంకటప్రసాద్, గోసాల కుమార్, గోసాల లవ కుమార్, నిమ్మగడ్డ కుటుంబరావు, సుందర్ రావు, సాయన హరి, వాలి ప్రవీణ్, జుజ్జువరపు ప్రశాంతి, కర్రె నాని,పాలడుగు రాంప్రసాద్, కొండపల్లి కుమార్ రెడ్డి, మహమ్మద్ ఖాసిం, గిరి బాబాయ్, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.