విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే పరమ పవిత్రమైన రోజు మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ ప్రజలకు ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలషించారు. ఎల్లవేళలా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. డివిజన్ ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మరియు నాయకులకు, అధికారులకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోళా శంకరుడు భూత గణాలకు అధిపతి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే పరమేశ్వరుడు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఎల్లవేళలా మనందరి కుటుంబాలపై ఉండాలని కోరుతూ ఎల్లవేళలా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News