గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా సెలవులు తీసుకోకూడదని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల నిర్వహణపై పశ్చిమ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ., అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, ఏఈఆర్ఓలు, సూపరిండెంట్లతో మంగళవారం కమిషనర్ చాంబర్ లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజికవర్గాల్లో ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు కేటాయించబడే వాహనాలకు జిపిఎస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని, అభ్యర్ధుల ప్రచార సామాగ్రి ప్రింట్ చేసే ప్రెస్ లకు ఎన్నికల నిబందనల మేరకు తీసుకోవాల్సిన చర్యలపై నోటీసులు జారీ చేసి వారితో మీటింగ్ పెట్టాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో వీడియో రికార్డింగ్ చేయడానికి తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, నామినేషన్స్ రిసీవ్ చేసుకునే రూమ్స్ లో ఎస్.ఈ.తో సమన్వయం చేసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని మేనేజర్ ని ఆదేశించారు. సూపరిండెంట్లు తప్పనిసరిగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా సెలవులు తీసుకోవద్దన్నారు. సమావేశంలో ఎస్.ఈ. సుందర్రామిరెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఏఈఆర్ఓలు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, వెంకట లక్ష్మీ, సునీల్, నిరంజన్, ఏడిహెచ్ రామారావు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …