గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఏక మొత్తంగా ఆస్తి, ఖాళీ స్థల పన్నులు చెల్లిస్తే, వాటి పై ఉన్న వడ్డీని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, నెలాఖరు వరకే గడువు ఉందని నగర కమీషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కూడా ప్రకటించిందని, మార్చి నెలాఖరులోపు పన్ను చెల్లించకుంటే వడ్డీ రాయితీ వర్తించదని, ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల పన్నులు పూర్తిగా చెల్లించి వడ్డీ రాయితిని పొందాలని తెలిపారు. నెలాఖరు వరకు వేచి చూడకుండా, ముందుగానే పన్ను చెల్లించాలని, నెలాఖరులో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. నగరంలో నిర్మాణంలో భవన యజమానులకు ఖాళీ స్థల పన్ను పై వడ్డీ రాయితీ ప్రకటించడం సదవకాశమని, అటువంటి వారు వెంటనే పన్ను చెల్లించాలన్నారు. లేకుంటే మార్చి తర్వాత వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. పన్ను చెల్లింపుదార్లకు వీలుగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటుగా, భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లో కూడా క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కావున నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Tags guntur
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …