గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు తూర్పు, పశ్శిమ నియోజకవర్గాల్లో సాదారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకుల నుండి అందిన ఫిర్యాదులు, ఆర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై అందిన ఆర్జీల పరిష్కారంపై పశ్శిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాపై ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిదుల నుండి అందిన అర్జీలు, ఫిర్యాదులను వేగంగా పరిష్కారం చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చినా అధికారులు సిద్దంగా ఉన్నారని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి వార్డ్ సచివాలయ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ నెల 4 నుండి 10 వరకు తూర్పు, పశ్శిమ నియోజకవర్గాల వారీగా ఫారం 6, 7, 8 లు, షిఫ్టింగ్ దరఖాస్తులు 2,339 అందాయని వాటిని 2 రోజుల్లో పరిష్కారం చేయడానికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. పార్టీల ప్రతినిధులు సూచనల మేరకు తుది పోలింగ్ కేంద్రాల లిస్టు ని త్వరలో అందిస్తామన్నారు.
సమావేశంలో ఏఈఆర్ఓలు ప్రదీప్ కుమార్, సునీల్, సూపరిండెంట్లు సాంబశివరావు, పద్మ, రాజకీయ పార్టీలైన వైఎస్సార్సీపి నుండి డి.జాని బాబు, టిడిపి నుండి ఓంకార్, బిఎస్పి నుండి సిహెచ్.వాసు, బిజెపి నుండి పాండురంగ విఠల్, అమ్ ఆద్మీ నుండి సేవకుమార్, కాంగ్రెస్ నుండి బాల స్వామి పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …