-చిన్న చిన్న ప్రచారాలను నమ్మొద్దు గుండె ధైర్యం పోరాటబలం పశ్చిమ జనసేన సొంతం
-వైసీపీ సిద్ధమంటే పశ్చిమ జనసేన తరఫున రె”డీ”అనే నినాదం విజయవంతం అయ్యింది
-జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ 35వ డివిజన్లో చిరుప్యారులకు టిఫిన్ క్యాంటీన్లు పంపిణీ
-ఐదేళ్లలో వైసిపి అవినీతిని నిర్భయంగా బయటపెట్టాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన, టిడిపి,బిజేపి లక్ష ఓట్లు లక్ష్యంగా పనిచేయాలని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. స్థానిక 35వ డివిజన్ పరిధిలో నాయకులు ప్రదీప్జ్ ఆధ్వర్యాన మంగళవారం సాయంత్రం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిరుప్యాపారులకు పోతిన మహేష్ గారి సొంత నిధుల నుండి 2 స్టీలు టిఫిన్ క్యాంటీన్లను మహేష్ పంపిణీ చేశారు. డివిజన్ నాయకులు ప్రదీప్ రాజ్ టిడిపి నాయకులు హనుమంతరావు, నందనమ్మ, చార్లెస్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముందుగా రంజాన్ ఉపవాస దీక్షల ప్రారంభం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో లక్ష ఓట్లు లక్ష్యంగా జనసేన కార్యకర్తలంతా పనిచేయాలని, చిన్న చిన్న ప్రచారాలను నమ్మొద్దని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నాయకులకు అందరిదీ ఒకటే లక్ష్యమన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన విస్తృత సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఆదిశగా అడుగులు ముందుకు వేయాలని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, జనసేన కోసం పశ్చిమ నియోజకవర్గ సంక్షేమం కోసం నిలబడాలని కోరారు. గత ఐదేళ్లలో వైసిపి అవినీతి, అక్రమాలను బయటపెట్టామని, గుండెధైర్యం, పోరాటబలం ఉన్న జనసేన కార్యకర్తలు రూమర్స్ ని నమ్మద్దన్నారు. వైసిపి సిద్ధమంటే జనసేన తరుపున రెడీ అని నినాదం విజయవంతం అయిందని పేర్కొన్నారు. ప్రదీప్ రాజ్ కూడా చిరువ్యాపారులు కోసం పనిచేస్తున్నారని, అటువంటివారు మరింత ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో వెన్న శివశంకర్ సుమన్, నాయక్ చంటి, రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News