-రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.
-మంత్రి వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట గ్రామపంచాయతీలో రు.2.23 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పలు డ్రైన్లు, అంతర్గత సీసీ రహదారులకు మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో రు. 45 లక్షలతో, పిడుంగొయ్యి రు. 64 లక్షలతో, ధవలేశ్వరంల్లో రు. 74 లక్షలతో, శాటిలైట్ సిటీ లో రు.40 లక్షల రూపాయలతో పలు అంతర్గత సీసీ రహదారులు, ట్రైన్ లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.
ఇందులోభాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పిడుగు గ్రామపంచాయతీ కవలగొయ్యి లో 9 అంతర్గత రహదారులు 6 సిసి డ్రైన్లు, బుచ్చియనగర్ నందు 2 సీసీ రోడ్స్,పిడింగొయ్యి నందు 22ల్ సీసీ రోడ్స్, శ్రీలక్ష్మి నగర్ లో ఒక సీసీ డ్రైన్, జైహింద్ నగర్ నందు ఒక సీసీ డ్రైను, హుకుంపేట ఏరియా శాంతిపురంలో పలు సీసీ డ్రైన్ ల నిర్మాణం, నాగిరెడ్డి నగర్ లో పలు అంతర్గత సీసీ రహదారులు, గణేష్ నగర్ లో అంతర్గత సీసీ. రహదారులు, సిసి డ్రైన్లు, చైతన్య నగర్ లో పలు అంతర్గత సీసీ రహదారులు, ధవలేశ్వరం గ్రామంలో పలు అంతర్గత సీసీ రహదారులు, సాటిలైట్ సిటీ గ్రామంలో పలు అంతర్గత సీసీ రహదారులకు నిర్మాణ పనులను ప్రారంభించుకున్నామని మంత్రి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపేట వేస్తుందని గ్రామాలను పట్టణాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛత కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తుందని ప్రజలు కూడా ఇందుకు తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంపీడీవో డి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ సంపత్ కుమార్, పలువురు అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.