Breaking News

వర్చువల్ ద్వారా ప్రధాన మంత్రి సూరజ్ ప్రోగ్రాం కు హాజరైన లబ్దిదారులు

-తూర్పు గోదావరి జిల్లాలో 414 మంది లబ్ధిదారులకు రూ.14 కోట్ల 51 లక్షలు ప్రయోజనం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో అట్టడుగున ఉన్న అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అందచేసే కార్యక్రమాలు ద్వారా ప్రయోజనము చేకూర్చడం జరుగుతోందని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డివి ప్రసాద్ లు పేర్కొన్నారు. బుధవారము సాయంత్రం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా అందచేసిన సందేశాన్ని దూరదర్శన్ ద్వారా తిలకించడం జరిగింది.

తూర్పు గోదావరి జిల్లాలో నమస్తే ప్రోగ్రాం (మునిసిపాలిటీలు/ నగర పాలిక ప్రాంతాలలో మురుగు నీరు / మలినాలు / వ్యర్ధ పదార్ధాలు మరియు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయు పారిశుధ్య కార్మికులకు పిపిఈ కిట్లు కింద కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో 4 కిట్లు, నిడదవోలు పురపాలక సంఘం పరిధిలో 29 కిట్లు అందజేసినట్లు తెలిపారు.

• NSFDC ఆర్ధిక సంస్ధ ఎస్సి లబ్దిదారులకు , NSKFDC ఆర్థిక సంస్థ ద్వారా సహాయం పొందిన సఫాయి కర్మదారి లబ్దిదారులకు , NBCFDC ఆర్ధిక సంస్థ ద్వారా బి.సి. స్వయం ఉపాధి లబ్దిదారులకు చెంది జిల్లా వ్యాప్తంగా 414 మందికి రూ.14,50,68,219 లు మేర ఆర్ధిక ప్రయోజనము చేకూర్చడం జరిగిందన్నారు.

•ఇందులో PM DAKSHIT- వివిధ బ్యాంకులు ద్వారా జిల్లాలో ఎస్సి, బిసి ఆర్థిక సహాయం పొందిన 278 మంది లబ్దిదారులకు రూ.73,42,413 లు , స్త్రీనిధి పథకం ద్వారా లబ్దిపొందిన 64 మహిళా సంఘముల సభ్యులకు 1,87,49,520 లు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పి. సువర్ణ, ఎమ్. భాను ప్రకాష్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, డి ఆర్ డీ ఏ పిడి ఎన్ వివి ఎస్ మూర్తి , డి ఎల్ డి వో పి. వీణా దేవి , జిల్లా బిసి సంక్షేమ అధికారి పి ఎస్ రమేష్, ఎల్ డి ఎమ్ డి వి ప్రసాద్, స్త్రినిధి అధికారి ధర్మేంద్ర , ఇతర అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *