Breaking News

తిరుపతి జిల్లా విద్యా, వైద్య, పర్యాటక, టెంపుల్, పారిశ్రామిక హబ్ గా ఎన్నో అవకాశాలు గల జిల్లా

-విభిన్న సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనం మన దేశ గొప్పదనం: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
-ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఒక గొప్ప విభిన్న సంస్కృతుల మేళవింపు… త్రిపుర నుండి వచ్చిన విద్యార్థుల బృందం తో సమావేశమైన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా విద్యా, వైద్య, పర్యాటక, టెంపుల్, పారిశ్రామిక హబ్ గా ఎన్నో అవకాశాలు గల జిల్లా అని, విభిన్న సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనం మన దేశ గొప్పదనం అని, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల ప్రజల విభిన్న సంస్కృతి, సంప్రదాయాలను మరియు ఇతర పరిజ్ఞాన విషయాలను తెలుసుకోవడానికి త్రిపుర నుండి వచ్చిన 45 మంది విద్యార్థుల బృందంతో సమావేశమై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ పేర్కొన్నారు.

బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రజలు ఆచరిస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు మరియు అభ్యాసాల పరిజ్ఞానం, రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన మరియు సంబంధానికి దోహద పడుతుందని, తద్వారా భారతదేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతను బలోపేతం చేస్తాయని తెలిపారు.

అనంతరం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమని పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా తెలుగు రాష్ట్రం ఏర్పడిందని, నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో తిరుపతి జిల్లాగా ఆవిర్భవించిందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము విభిన్న సంస్కృతులు, భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కలిగి ఉన్నదని, ఉత్తర కోస్తా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, రాయలసీమ విభిన్న సంస్కృతులు, వాతావరణ, భౌగోళిక పరిస్థితులు గల తెలుగు జిల్లాలని తెలిపారు. రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా విద్యాహబ్ గా ఐఐటి, ఐజర్, ఐఐఐటి శ్రీసిటీ, కల్నరి ఇన్స్టిట్యూట్ తదితర ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయని, అలాగే మెడికల్ హబ్ గా స్విమ్స్, టాటా స్వీకార్ క్యాన్సర్ ఆస్పత్రి, అరబిందో కంటి ఆసుపత్రి, బర్డ్స్ఆసుపత్రి తదితర వైద్య సదుపాయాలు కలిగి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తిరుపతి జిల్లాలోనే ఉన్నదని, దీనితో పాటుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం,శ్రీకాళహస్తి తదితర దేవాలయాలతో కూడిన టెంపుల్ సిటీ గా ప్రసిద్ధి చెందిందని, తిరుమల లడ్డు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ పొందిందని, అలాగే వెంకటగిరి చీరలు దేశంలోనే ప్రసిద్ధిగాంచి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ గా తిరుపతి జిల్లాలో ఉన్నదని తెలిపారు. పరిశ్రమల హబ్ గా వివిధ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని, శ్రీసిటీ ఉందని, క్రిసిటీ ఏర్పాటు కానున్నదని విభిన్న సంస్కృతుల సమ్మేళనం మన దేశ గొప్పతనం అని, నేడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేసి స్ఫూర్తిదాయకమైన సందేశం అందించారు. విద్యార్థులు భ్యవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ త్రిపుర బృందానికి జిల్లా కలెక్టర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమ ప్రారంభంలో IISER తిరుపతి అసోసియేట్ డీన్ (స్టూడెంట్ యాక్టివిటీస్) డా.వసుధారాణి దేవనాథన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా, త్రిపురకు చెందిన 45 మంది విద్యార్థుల బృందం మార్చి 9 నుండి 14, 2023 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు అని, వీరికి IISER తిరుపతి నోడల్ ఇన్‌స్టిట్యూషన్‌గా ఉందని తెలిపారు. ఈ విద్యార్థుల బృందం జిల్లాలోని షార్‌, ఎన్‌ఎఆర్‌ఎల్‌, శ్రీసిటీ, తిరుమల, గుడిమల్లం తదితర ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించిందని, ఈ యువ సంగం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి మరియు వారితో సంభాషించడానికి అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం IISER తిరుపతి డిప్యూటీ రిజిస్ట్రార్  ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ, IISER తిరుపతి అసోసియేట్ డీన్ జిల్లా కలెక్టర్ ని సత్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి వారందరూ గ్రూప్ ఫోటో దిగారు.

ఈ కార్యక్రమంలో ఐజర్, తిరుపతి సీనియర్‌ ఇంజనీర్‌ శివకుమార్‌ కునా, డిప్యూటీ రిజిస్ట్రార్‌ హిమాన్‌షు శేఖర్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *