-పరిశీలించిన నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యర్థ నిర్వహణలో ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ, జ్ఞానాన్ని పెంచే RRR నాలెడ్జ్ సెంటర్ను విజయవాడ నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉదయం అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరానికి మెరుగులు దిద్దటమే కాకుండా నగర ప్రజల్లో వ్యర్ధ నిర్వహణ గురించి అవగాహన కల్పించేందుకు అజిత్ సింగ్ నగర్ ఎక్స్ఎల్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నందు నిర్మాణంలో తుది దశలో చేరుకున్న RRR నాలేజ్ సెంటర్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించే 3d సూక్ష్మ నమూనాలను, అవి పని చేసే విధానాన్ని పరిశీలించారు.
ప్రజలకు విజ్ఞానమే కాకుండా వ్యర్ధలను సేకరిస్తున్న ప్రాంతమైనప్పటికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు, కాలుష్యాన్ని తగ్గించే అందమైన మొక్కలు ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎంతో సుందరంగా, విజ్ఞాన కేంద్రంగా మారనున్న అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో గల RRR నాలెడ్జ్ సెంటర్ అతిత్వరలో ప్రారంభానికి సిద్ధం చేయమని కమిషనర్, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో పాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె. సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్ ) ఏ ఎస్ ఎన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.