-ఆంగ్ల భాషానైపుణ్యాలు పెంపొందించడానికి ‘వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్’ పోటీలు
-ఏప్రిల్ 12న ముంబై లో జరిగే ‘గ్రాండ్ ఫినాలే’ పోటీలకు 8 మంది విద్యార్థులకు అవకాశం
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారుల మెదడుకు పదును పెడితే గొప్ప విజ్ఞాన సంపదను పొందుతారని, విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడానికి, వారిలో శక్తిని వెలికితీయడానికి ఇలాంటి వేదికలు అవసరమని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT), సమగ్రశిక్షా, ఆంధ్రప్రదేశ్, Vibha, Leapforword సహకారంతో, గురువారం విజయవాడలోని బెర్మ్ పార్క్ లోని జరిగిన ‘వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్’ రాష్ట్ర స్థాయి పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. పోటీలో భాగంగా చిన్నారులు అద్భుతంగా స్పెల్లింగ్స్ చెప్పడం గమనించి వారితో కాసేపు ముచ్చటించి ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మెచ్చుకున్నారు. మట్టిలో మాణిక్యాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెలికితీసి వారిని ప్రతిభాశాలురుగా తీర్చిదిద్దాలని అన్నారు.
Vibha, Leapforword సంస్థలు 2021 నుంచి విద్యాశాఖతో మమేకమై ఇంగ్లీష్ లిటరీసీ (ఈఎల్పీ) ప్రొగ్రాం ద్వారా ఆంగ్ల పదాలను సులభతరంగా పలకడం, చదవడం నేర్పిస్తున్నారు. భాషా నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాల్లో ‘వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్’ భారతదేశపు అతిపెద్ద ఆంగ్ల పోటీగా నిర్వాహకులు పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 2 నుండి 5 వ తరగతి విద్యార్థుల్లో ఆంగ్ల అక్షరాస్యత, భాషా నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మక జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో 17 మండలాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్నారు. మార్చి 7న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించగా, 24 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి చేరుకున్నారు. 5 గ్రేడుల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విజేతలు ఏప్రిల్ 12న ముంబైలో జరిగే ‘గ్రాండ్ ఫినాలే’ పోటీలకు హాజరవుతారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ కేశిరాజు శ్రీనివాస్, డా. శారద, శామో విభాగం నుంచి అపర్ణ, డా. శారదా, విభా సౌత్ ఇండియా ప్రొగ్రాం మేనేజర్ టి. వీరనారాయణ, లీప్ ఫార్వర్డ్ సంస్థ వ్యవస్థాపకులు ప్రణీల్ నాయక్, చైతన్య, చందన, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే:
• రాష్ట్ర స్థాయి పోటీలకు 4 విభాగాల నుంచి 24 మంది హాజరుకాగా, గ్రేడ్ 2 విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కె.దీపిక (ముంచిగపుట్) ప్రథమ స్థానం దక్కించుకోగా, మర్రి రాజు (చింతపల్లి) ద్వితీయస్థానం సాధించాడు.
• గ్రేడ్ 3 విభాగంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బి.రేవంత్ కుమార్ (మైలవరం), మణిదీప్ కొంగని (కంచికచర్ల) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.
• గ్రేడ్ 4లో ఏఎస్ఆర్ జిల్లా నుంచి నుంచి శ్యామ్ సన్ (చింతపల్లి) మొదటి బహుమతి, మనస్విని.కె (పాడేరు) రెండో బహుమతి దక్కించుకున్నారు.
• గ్రేడ్ 5 విభాగంలో ఎన్టీఆర్ జిల్లా నుంచి అనిల్ కుమార్ బాణావతు (మైలవరం) ప్రథమ స్థానం, జమ్మి సాత్విక్ (రెడ్డి గూడెం).