Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నలుగురికి ఆర్థిక సహాయం

-ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయాన్ని అందచేసిన జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు

నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త :
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి వైయస్సార్ ఈబిసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు.

గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని… బికాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా… ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పైచదువులకు 15,000 రూపాయలు, జీవనోపాధికి మరో 15000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సియం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 వేల రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హరిజన గోరంట్లకు అందజేశారు.

బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని… నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా…. వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సియం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ అబ్దుల్ వజీద్ కు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు.

అలాగే అవుకు మండలం వేములపాడు గ్రామ నివాసితుడు బి.మనురాహుల్ తాను 6 సంవత్సరాల నుండి వికలాంగత్వంతో బాధపడుతున్నానని వ్యాధి చికిత్సకు తగిన ఆర్థిక స్తోమత తమ వద్ద లేదని, ముఖ్యమంత్రి గారు సహాయం చేయాలని కోరగా… ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సియం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు.

బనగానపల్లె పట్టణ వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్ తనకు 20 సంవత్సరాల వయసు ఉందని ఇంటర్ ఫెయిల్ అయ్యానని… నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా… ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. డా. కె.శ్రీనివాసులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వ్యాపారం చేసుకునేందుకు 2 లక్షల రూపాయల చెక్కును అబ్దుల్ హజీమ్ కు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటివరకు వారు సొంత నిధులతో ఖర్చుపెట్టిన ఖర్చుపెట్టిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సభా వేదిక, హెలిపాడు ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన 22 మంది అర్జీదారులకు ఆర్థిక సహాయం, పెన్షన్లతో పాటు వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు వారి సొంత నిధులతో వైద్యానికి ఖర్చు పెట్టుకున్న మొత్తానికి పూర్తిస్థాయి రియంబర్స్మెంట్ కు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

అడిగిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రికి మరియు జిల్లా కలెక్టర్ కు సంబంధిత అర్జీదారులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు

-రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు -రూ.1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం -వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *