Breaking News

హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులచే ప్రమాణం చేయించిన సిజె ధీరజ్ సింగ్ ఠాకూర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు లోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.
ఈకార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఎపి హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు,ఎపి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి,రిజిష్ట్రార్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్,బార్ అసోసియేషన్ మరియు బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *