Breaking News

నేషనల్‌ లా యూనివర్సిటీకి సీఎం వైయస్‌.జగన్‌ భూమిపూజ

కర్నూలు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జనన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్లతో నిర్మించనున్న నేషనల్‌ లా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ హైకోర్టు రెస్టింగ్‌ న్యాయమూర్తులకు, ఇతర కోర్టుల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ విభాగం సిబ్బందికి, ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు.

ఈరోజు మన రాష్ట్రంలో, మన రాయలసీమలో, అందులోనూ కర్నూలులో నేషనల్‌ లా యూనివర్సిటీకి మనం శంకుస్థాపన చేస్తున్నాం. ఈ కర్నూలు ప్రాంతానికి, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి .. ఈ కార్యక్రమం ఎంత భవిష్యత్‌ ఉన్న కార్యక్రమం అంటే… మనం మొదట నుంచి చెబుతున్నాం డీసెంట్రలైజ్డ్‌ గవర్నెన్స్‌ అనేది మనముఖ్య ఉద్దేశం.
ఇందులో భాగంగా శ్రీబాగ్‌ ఒడంబడిక నుంచి రాయలసీమ ప్రాంతాలకు 1937లో… అంటే 87 సంవత్సరాల కిందట ఈ ప్రాంత ప్రజలకు సహేతుకమైన న్యాయం జరిగేటట్టుగా ఆ శ్రీబాగ్‌ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు కూడా ఎప్పటి నుంచో దీని కోసం వేచి చూస్తున్నారు.

శ్రీబాగ్‌ ఒడంబడికలో భాగంగా జరిగిన ఆ ఒప్పందం మేరకు ఆ రోజుల్లో ఇక్కడే హైకోర్టు పెడతామని చెప్పారు. ఆ రోజుల్లోనే ఇక్కడకు రావాలి. హైదరాబాద్‌ ను రాజధానిగా చేస్తూ, అప్పటి దాకా రాజధానిగా ఉన్న కర్నూలుకు ఆ స్టేటస్‌ పోతున్న కారణంగా ఇక్కడ హైకోర్టు పెడతాము అని ఆరోజు చెప్పిన మాటకు… ఈరోజు అడుగులు ముందుకు పడే కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ నేషనల్‌ లా యూనివర్సిటీకి శంకుస్ధాపన చేస్తున్నాం. ఈ నేషనల్‌ లా యూనివర్సిటీ అన్నది ఇక్కడ రావడం, ఈ నేషనల్‌ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్‌ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది. ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని, దీని కోసం రూ.1000 కోట్లు మంజూరు చేయడం జరుగుతోంది.

ఇక్కడ ఇదే యూనివర్సిటీతోపాటు న్యాయ విభాగాలైన స్టేట్‌ కన్జ్యూమర్స్‌ డిస్ప్యూట్‌ అండ్‌ రిడ్రసల్‌ కమిషన్‌ను, ఏపీ లీగల్‌ మెట్రాలజీ కమిషన్‌ను, ఏపీ లేబర్‌ కమిషన్‌ను, ఏపీ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను, ఏపీ వక్ఫ్‌ బోర్డును, ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త కార్యాలయాలను, అదే రకంగా ఎస్‌హెచ్‌ఆర్సీ కార్యాలయాలు కూడా మన కర్నూలులో ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను.

దాదాపు 150 ఎకరాల సువిశాలమైన ఈ స్థలంలో ఇవన్నీ కూడా రాబోతున్న మంచి ఘడియలను దేవుడు ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగిస్తున్నాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దీని వల్ల ఈ ప్రాంతానికి రాబోయే రోజుల్లో మరింత మంచి జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను సీఎం తన ప్రసంగం ముగించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *