విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి శుక్రవారం ఉదయం 47 వ డివిజన్ లోని సర్కిల్ వన్ ఆఫీస్ నందు సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సానిటరీ సూపర్వైజర్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. తదుపరి 46వ డివిజన్ లోని దీన్ దయాల్ నగర్ లో డ్రైన్ ను నిర్మించుటకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ట్రైన్లను నిర్మించడం జరుగుతుందని తద్వారా దోమల నుండి మరియు దోమల ద్వారా కలుగు వ్యాధుల నుండి ప్రజలు రక్షణ పొందుతారని, పారిశుద్ధ నిర్వాహణలో నిమగ్నమైన పారిశుద్ధ కార్మికులైన, సానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు సానిటరీ సూపర్వైజర్లకు ఆఫీసు ఏర్పాటు చేయటం ద్వారా వారికి సౌకర్యాలు కల్పిస్తున్నారని. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక శంకుస్థాపన చేసుకోవడం ప్రజలు గమనించి విజయవాడ అభివృద్ధి బాటలో వెళ్తుందని నిజాన్ని గ్రహిస్తున్నారని, కేవలం పశ్చిమ నియోజకవర్గం లోనే కాకుండా సెంట్రల్ నియోజకవర్గం అయినా ఎనలేని అభివృద్ధి చెందిందని అది కేవలం జగనన్న ప్రభుత్వంలోనే జరిగిందని. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండూ, రెండు కళ్ళుగా భావించి సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదరించడమే కాకుండా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ షేక్ ఆసిఫ్, 47 వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, అసిస్టెంట్ ఇంజనీర్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News