-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ పేపర్ క్విల్లింగ్ ఆర్టిస్ట్ క్వీన్ ఆఫ్ క్రాఫ్ట్స్ గా పేరుగాంచిన మేడా రజని కళా నైపుణ్యాన్ని ఎన్.టి.ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఢిల్లీరావు ప్రశంసించారు. కాదేదీ కళకి అనర్హం అని నిరూపిస్తూ పనికి రాననుకున్న పేపర్ ముక్కలతో రమణీయమైన కళాకృతులను చేయటం ఆమెకే చెల్లిందన్నారు. మన విజయవాడ నగర ఖ్యాతిని ఇనుమడింప చేసే విధంగా గత సంవత్సరం మహానంది జాతీయ పురస్కారం, ఇటీవల జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ వారి నుంచి ప్రత్యేక సన్మాన సత్కారాలను పొంది ఎంతో మంది మహిళలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారనీ, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ వర్కింగ్ కమిటీ మెంబెర్ గా సామాజిక చైతన్యానికి చేస్తున్న కృషిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మేడా రజని పేపర్ లతో తాను రూపొందించిన పూల బొకే, మరియు పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ కలెక్టర్ కి మర్యాద పూర్వకంగా అందించారు.
Prajavartha Online Telugu News