రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు బాధ్యత లు స్వీకరించిన అనంతరము గురువారము జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత అభినందనలు తెలియజేశారు. మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద ఎత్తున అమూల్ బల్క్ మిల్క్ sయూనిట్స్ కు పాల వెల్లువ సేకరణ కేంద్రాల ద్వారా పాల సేకరణ లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. ఆమేరకు ప్రతి రోజు ఆయా కేంద్రల నుంచి 160 లీటర్లు మేర పాలను సేకరించాలనీ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ ఏరియా వెటర్నిటీ ఆసుపత్రి లో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న టి. శ్రీనివాస రావు ఉప సంచాలకులు గా పదోన్నతి పొంది తూర్పు గోదావరీ జిల్లా పశు సంవర్ధక అధికారిగా లో విధులకు హాజరు కావడం జరిగింది. 1993 లో చిలకలూరి పేట మండలము పశువుల ఆసుపత్రిలో సహాయ పశు వైద్యులు గా జాయిన్ అయ్యారు. కలెక్టర్ ను కలిసిన వారిలో డి ఎ హెచ్ వో డా టి. శ్రీనివాస రావు, కొవ్వూరు డివిజన్ పశు సంవర్ధక అధికారి జీ. రాధాకృష్ణ లు ఉన్నారు.
Tags rajamandri
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …