Breaking News

ప్రచార మాధ్యమాల్లోని పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా

-తాజా మార్గదర్శకాలపై ప్రచార మాధ్యమాలు సమగ్ర అవగాహన కలిగిఉండాలి
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రచార మాధ్యమాల్లో ప్రచురితము మరియు ప్రసారం అయ్యే పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్ర్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విదానాలపై భారత ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు మరియు భారత ఉన్నత న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా మాధ్యమాలు, మీడియా ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు ఆయన అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మీడియా వర్కుషాపు జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అనుగుణంగా అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. పెయిడ్ న్యూస్ అంశాన్ని ఆయన వివరిస్తూ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఇందుకై జిల్లా స్థాయిలోను మరియు రాష్ట్ర స్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటాయన్నారు. నిర్థేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్ ను గణించి, ఆ వ్యయాన్ని సంబందిత అభ్యర్థి ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి లోక్ సభ అభ్యర్థి రూ.95 లక్షలు, శాసన సభ అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అమమతి ఉందన్నారు. అయితే పెయిడ్ న్యూస్ గా నిర్థారణ అయిన ఆర్టికల్స్ కు సంబందించి రేటు కార్డు ప్రకారం ఖరారు చేయబడిన సొమ్మును సంబందిత అభ్యర్థికి అనుమతించి వ్యయం క్రింద జమచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఎం.సి. & ఎం.సి. ఉన్న అధికారాలు, పరిధిని ఆయన వివరిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబందించి కూడా ముందస్తుగా ఎం.సి. & ఎం.సి. అనుమతి పొందాల్సి ఉంటుందని, అనుమతి పొందిన అర్డరు కాపీ నెంబరున కూడా సంబందిత ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అన్ని ప్రచార మాధ్యమాలు తప్పనిసరిగా గమనించాలని ఆయన కోరారు. ఎం.సి. & ఎం.సి. అనుమతి లేకుండా చేసే ప్రకటనలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా పరిగణిస్తూ చట్టం ప్రకారం తగు చర్యలు చేపట్టడం జరుతుందని ఆయన తెలిపారు.

అదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో మీడియా మాధ్యమాలు, మీడియా ప్రతినిధులు అనుసరించాల్సిన తాజా మార్గదర్శకాలను, మీడియా సెల్ ద్వారా మీడియా ప్రతిదినిధులకు కల్పిస్తున్న సౌకర్యాలను, పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు మీడియా ప్రతినిధులకు జారీచేసే అథారిటీ లెటర్స్ మరియు ఆయా రోజుల్లో మీడియా కవిరేజీని ఎక్కడ వరకూ అనుమతిస్తారు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ఈ వర్కుషాపులో ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారు.

అదనపు సీఈవో పి. కోటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో ఎస్ మల్లిబాబు, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్లు కస్తూరి తేళ్ల, ఐ.సూర్యచంద్రరావు తదితరులతో పాటు అన్ని మధ్యమాలకు చెందిన మీడియా ప్రతినిధులు ఈ వర్కుషాపులో పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *