Breaking News

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గజ్జల వెంకట లక్ష్మి

– ప్రభుత్వ జీవో ద్వారా నియమక ఉత్తర్వులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ గా గజ్జల వెంకటలక్ష్మిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ఈ రోజు రాత్రి ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసింది. గజ్జల వెంకట లక్ష్మి ఇప్పటికే మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పటి వరకు కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీగా ఉన్న ఛైర్ పర్సన్ పదవికి గజ్జల వెంకట లక్ష్మిని నియామకం చేస్తూ ముఖ్యమంత్రి  నిర్ణయం తీసుకున్నారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పూర్తి స్థాయి అధికారాలతో గజ్జల వెంకట లక్ష్మి కొనసాగనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటినుంచి గజ్జల వెంకట లక్ష్మి కొనసాగుతున్నారు. ఆమె దాదాపుగా పదేళ్ళకు పైగా జగన్ తోనూ, పార్టీతోను కలసి  పనిచేస్తున్నారు. జగన్ వెన్నంటి ఉన్న నేతలలో ఆమె కూడా ఒకరు. దాంతో ఆమె సేవలకు గాను జగన్ గుర్తించి ఈ గౌరవనీయమైన పదవిని ఆమెకు అప్పగించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *