Breaking News

కోలాహలంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్, యువనేత దేవినేని అవినాష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విజయవాడ నగర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయానికి వందలాది గా తరలి వచ్చిన అభిమానులు సందడి చేశారు. 11వ డివిజన్ లో విచ్చేసిన అవినాష్ కు స్థానిక నాయకులు పర్వతనేని పవన్, కరుటూరి హరీష్, ఉదయ్ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేపించి, గజ మాలతో సతక్రించి బారి అన్నదానం ప్రారంభించారు. 5 డివిజన్ లో అన్నదానం ప్రారంభించారు. అదేవిధంగా నగర వ్యాప్తంగా అభిమానులు పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి అవినాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన మీద ఇంత అభిమానం చుపిస్తున్న అభిమానుల ప్రేమను ఎన్నటికీ మర్చిపోలేను అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా అవినాష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *