Breaking News

సీఎం జగన్ తోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-రూ.32.59 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుణదలలో రూ.32.59 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు ఉద్ధంటి సునీత, ఎండి షాహినా సుల్తానాలతో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 30 వేల మంది జనాభాకు సరిపడా అమృత్ 2.0 మరియు 15వ ఆర్థిక సంఘం నిధులతో అండర్ గ్రౌండ్ లైన్ పనులకు భూమిపూజ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా గుణదల నుంచి 60, 59 వ డివిజన్ల మీదుగా సింగ్ నగర్ STP కి అనుసంధానిస్తూ.. 18 కి.మీ. మేర డిస్ట్రిబ్యూషన్, 8 కి.మీ. మేర పంపింగ్ మెయిన్ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, గుణదల ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం రూ. 84.73 కోట్లతో వాంబేకాలనీలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మించనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గుణదల ఆర్వోబీని సైతం పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఏలూరు రోడ్డు నుంచి వచ్చే ఏ వాహనమైనా నేరుగా ఇన్నర్ రింగ్ రోడ్డులో కలిసే విధంగా వంతెనల నిర్మాణాలను పూర్తిచేస్తామని తెలియజేశారు. కనుక గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలని కోరారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. నగరంలో ఈ ఐదేళ్లలో జరిగినంత అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి నేతృత్వంలో సెంట్రల్ ప్రాంతం ఎంతో పురోభివృద్ధిని సాధించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, నాయకులు ఉద్ధంటి సురేష్, కొండా మహేశ్వరరెడ్డి, హఫీజుల్లా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *