Breaking News

జాతీయ లోక్ అదాలత్ లో కోటి పన్నెండు లక్షల పరిహారం అందుకున్న యార్లగడ్డ బృందదేవి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారము తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానానికి సంబంధించిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో (MVOP 316/2021) (అక్షరాల ఒక కోటి పన్నెండు లక్షల (రూ.1,12,00,000/-) పరిహారం పొందిన బాధితురాలు ఆమె స్పందనను తెలియజేశారు.

రోడ్డు ప్రమాదంలో భర్త మరణిచడంతో “తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం మరియు మోటారు వాహన ప్రమాదాల దావా న్యాయస్థానము” నందు భార్య, ఆమె కుమార్తెలు మరియు ఆమె అత్త 2021 సంవత్సరంలో కేసు వేసినట్లు యార్లగడ్డ బృంద దేవి (భార్య) చెప్పారు. అయితే తమ కేసుని రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా అవకాశం దొరికిందన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత 16 మార్చి 2024 న రాజమహేంద్రవరంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ నందు రూ.1,12,00,000/- పరిహారం అందజేసినట్లు వివరించారు. భర్తను కోల్పోయిన ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు చేయూతగా ఇది ఉపయోగ పడుతుందని హర్షం వ్యక్తపరిచారు. ఆమె సమస్యకు సత్వర న్యాయం అందజేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి, కేసుకు పరిష్కారం చూపిన ఆమె న్యాయవాదులు ఎస్.జి.శంకర్, కె.నరసింహ రావు లకు, భీమా సంస్థ న్యాయవాది దునే శ్రీనివాస రావు, చోళ మండలం భీమా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *