Breaking News

ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో అమలులోనికి రావడం జరిగింది….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికల షెడ్యూల్- 2024 ప్రకటన విడుదల చేసిన నేపధ్యంలో తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో అమలులోనికి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం జిల్లా కలక్టరేట్ సమావేశ మందిరం నుంచి దృశ్య విజ్ఞాన మాధ్యమం ద్వారా కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి డా కే. మాధవీలత , ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు 2024 సార్వత్రిక ఎన్నికలు పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు, సహయ రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల జిల్లా , డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ప్రవర్తన నియమావళి పై  సూచనలు చెయ్యడం జరిగిందన్నారు.

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది వెంటనే వారికీ నిర్దేశించిన ఎన్నికల , అనుబంధ కార్యకలాపాలను చేపట్టాలన్నారు. విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం చూపరాదన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈరోజు నుంచే విధులను నిర్వర్తించడం ప్రారంభించాలన్నారు. ప్రతి వాహనానికి జీ పి ఎస్ ఏర్పాటు చేసుకొవాలని, ఇందుకు సంబంధించి జిల్లా రవాణా అధికారిని సంప్రదించాలన్నారు.

స్టాస్టిటిక్ సర్వైవల్ బృందాలు, బోర్డర్ టీమ్స్ .. నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి విధులను నిర్వర్తించడం ప్రారంభించాలని స్పష్టం చేశారు.

మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్టు కు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్వర్తించాలని తెలిపారు.

వ్యక్తిగతంగా రూ.50 వేలు మించి నగదు రూపంలో తీసుకుని వెళ్ళడానికి అనుమతి లేదని, ఇటువంటి ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తాలను తీసుకు వెళ్తే సీజ్ చెయ్యాలన్నారు. ప్రతి ఒక్క ఘటనను వీడియో రికార్డింగ్ చెయ్యడం, వాటితో పాటు వాయిస్ ఓవర్ కూడా రికార్డింగ్ చెయ్యడం చాలా అవసరం అన్నారు.

అధికార వాహనాల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహ రించాలన్నారు. మంత్రులు మరియు ఇతర రాజకీయ నాయకులు పాల్గొనే సమీక్షలు, సమావేశాల్లో ప్రభుత్వ అధికారులు సిబ్బంది వ్యక్తిగతంగా లేదా సమిష్టి గా హజరు కారాదని, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలువ రాదని, కార్యాలయాల్లో మాత్రమే రాజకీయ పార్టీల ప్రతినిధులు వొచ్చి ఎన్నికల అధికారిక విధులు కింద మాత్రమే కలవవచ్చు అన్నారు.

24 గంటల్లో, 48 గంటల్లో, 72 గంటల్లో ఎన్నికల, అనుబంధ విధుల్లో ఉండే అధికారులు సిబ్బంది తీసుకోవలసిన తక్షణ చర్యలు పై ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. మార్గదర్శకాలు పూర్తి స్ధాయిలో అవగాహాన చేసుకుని, ఆచరణ లో చూపాలన్నారు.

*” ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలు పై మార్గదర్శకాల ఖచ్చితంగా పాటించాలన్నారు. సైరన్ కలిగిన పైలట్ కారుతో మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పర్యటనలలో ఉపయోగించరాదని తెలిపారు.

ఎన్నికల ప్రకటన వెలువడిన 24 గంటల్లో ప్రభుత్వ ఆస్తులపై వాల్ రైటింగ్‌లు, పోస్టర్లు, పేపర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లు, జెండాలు తొలగించాలన్నారు. వాల్ రైటింగ్‌లు / పోస్టర్లు / పేపర్లు / కటౌట్లు / హోర్డింగ్‌లు / బ్యానర్లు / జెండాలు వంటి అనధికారిక రాజకీయ ప్రకటనలు తొలగించాలన్నారు. రాబోయే  48 గంటలలోపు పబ్లిక్ ఆస్తులు , కార్యాలయాల్లో ఉదా:  బస్టాండ్, రైల్వే స్టేషన్, రైల్వే వంతెనలు, రహదారి మార్గాలలో  ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మునిసిపల్, పంచాయతి లలో ప్రభుత్వ ప్రకటనలు , హార్డింగ్లు   తొలగించాలన్నారు. నిర్ణీత రుసుం చెల్లించి ప్రదర్శించిన వాటిని కొనసాగించవచ్చు అని పేర్కొన్నారు.   ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రభుత్వం సాధించిన విజయాలను చూపే ప్రభుత్వ ప్రకటన లని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం, ప్రచురించే అన్ని  ప్రకటనలు రానున్న 48 గంటలు లోగా నిలుపుదల చెయ్యలన్నారు. బహిరంగ గా ప్రదర్శించే రాజకీయ కార్యకర్తల ఫోటో లేదా పార్టీ చిహ్నాన్ని కలిగి ఉన్న అన్ని హోర్డింగ్‌లు 48 గంటల్లోగా తొలగించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, జిల్లా ఎన్నికల అధికారి కి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగిందని వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్ధుల ద్వారా వొచ్చే ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా విభాగాల ద్వారా క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ప్రారంభించబడిన పనుల జాబితా,  ప్రారంభించని తాజా పనుల జాబితా అంద చెయ్యాలన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన 72 గంటల లోపు ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో, సంస్ధల ద్వారా చేపడుతున్న అభివృద్ధి/నిర్మాణానికి సంబంధించిన  ఆయా పనుల నివేదిక అంద చేయాలన్నారు. ప్రస్తుతం ఆయా పనుల యదార్ధ స్థితి పై  జిల్లా ఎన్నికల అధికారి కి, ఎన్నికల సంఘానికి నివేదిక అంద చేయ్యాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులు, సిబ్బంది బదిలీలు, డిప్యూటేషన్ లుపై  పూర్తి నిషేధం ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వ భవనాలపై రాజకీయ నాయకుల, కార్యకర్తల ఛాయా చిత్రాలు మరియు చిత్రాలు ప్రదర్శించరాదని, ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి సందర్భంలో  లబ్ధిదారులకు పంపిణీ చేయబడిన లబ్ధిదారుల కార్డులు,  అమలు సమయంలో ఏర్పాటు చేయబడిన నిర్మాణ స్థల ఫలకాలు మొదలైన వాటిలో ముఖ్యమంత్రులు, మంత్రులు మరియు ఇతర రాజకీయ కార్యకర్తల ఫోటోలు, సందేశాలు ఉండరాదన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ముందు పంపిణీ చేయబడిన / ప్రతిష్టించబడిన లబ్ధిదారుల కార్డులు, నిర్మాణ సైట్ ఫలకాలు మొదలైన వాటిపై  జోక్యం అవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రూపొందించ బడే విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, టీకా సర్టిఫికెట్లు , ఇతర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మొదలైన వాటినీ అందచేసే వాటిపై రాజకీయ కార్యకర్తలు/పార్టీల ఫోటోలు లేదా సందేశాలు/చిహ్నాలు ఉండకూడదు.

ఎన్నికల పర్యటనలలో మంత్రులకు ప్రభుత్వ అతిథి గృహాలలో వసతి కల్పించరాదన్నారు.

** ఎంపీ, ఎమ్మేల్యే ల్యాడ్ ( స్ధానిక ప్రాంత అభివృద్ధి) నిధులతో లేదా  ఇతర ప్రభుత్వ పథకాల కింద నిధులు సమకూర్చబడిన  నీటి ట్యాంకులు, అంబులెన్స్‌లు మొదలైన మొబైల్ వాహనాలు పై రాజకియ పార్టీల ఎంపీ , ఎమ్మేల్యే ఫోటోలు కనపడకుండా మూసి ఉంచాలన్నారు.

** జీవిత భాగస్వామి రాజకీయ రంగంలో  ఉన్న సంబంధిత అధికారులందరూ  ఎన్నికల కార్యకలాపాలకు, ప్రచారానికి దూరంగా ఉండడం, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన ప్రభుత్వా నియమాలను ఖచ్చితంగా పాటించాలన్నారు.

** ప్రతీ ప్రభుత్వోద్యోగి ఎన్నికల ప్రవర్తన నియమావళి పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. పార్టీ కి లేదా అభ్యర్థికి అనుకూలం గా ఉండరాదని,  ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదన్నారు.

రాజకీయ పార్టీల  కార్యక్రమం లో పాల్గొనడం, ప్రచారం చెయ్యడం,  ఏదైనా ప్రయోజనం /బహుమతి పొందడం లేదా ఎన్నికల సమయంలో అనవసర మైన ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నించడం వంటి ఏదైనా సంఘటన ప్రవర్తనా నియమాలకు విరుద్ధం అన్నారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం, 1951 లోని సెక్షన్‌లను ఉల్లంఘిస్తే, అటువంటి ప్రభుత్వ ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై క్రమశిక్షణా చర్యలలో భాగంగా  IPC 171 మరియు సెక్షన్లు 123, 129, 134 మరియు 134A ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాల పై ప్రదర్శిస్తున్న ఫోటోలను మూసి ఉంచేలా జాగ్రతలు తీసుకోవాలన్నారు.
ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రక్రియ జాబ్ కార్డ్ ఉపాధి అవకాశాలు కొనసాగించవచ్చు అన్నారు.

పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అయితే, కేవలం ఆర్వో నిర్దేశించిన ఫేసిలిటేషన్ కేంద్రం వద్ద మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుందనీ అన్నారు.

ఏ ఏ రోజులలో నివేదికలు పంపడం పై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని, ఆమేరకు ఖచ్ఛితంగా సమయపాలన పాటించడం అవసరం అన్నారు.

జీరో వయోలెన్స్.. జీరో రీ పోల్ నినాదం తో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించడం లో ఎన్నికలను సమన్వయంతో, అంకిత భావంతో పనిచేస్తే మాత్రమే సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ సంఘటనలు జరిగే అవకాశం ఉందో ముందుగా గుర్తించి అక్కడ ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సాధ్యం అవుతుందని అన్నారు. అదే విధంగా రీ పోల్ జరుగకుండా ఖచ్చితమైన కార్యాచరణ విషయంలో ప్రణాళికా సిద్దం చేసుకోవడం ముఖ్యం అన్నారు. ఎన్నికల ఓటింగు ప్రక్రియలో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురైతే ఎటువంటి అడుగులు వేసి అటువంటి పరిస్థితి సమర్థవంతంగా అమలు చెయ్యగలమో అధికారులుగా మీ పనితీరు చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందనీ అన్నారు.

ప్రతీ బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎప్పటి కప్పుడు ఎన్నికల కమీషన్ మార్గదర్శకా లను ఖచ్చితంగా పాటించేలా అవగాహాన కల్పించాలన్నారు.

పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అయితే, కేవలం ఆర్వో నిర్దేశించిన ఫేసిలిటేషన్ కేంద్రం వద్ద మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుందనీ అన్నారు.

ఏ ఏ రోజులలో నివేదికలు పంపడం పై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని, ఆమేరకు ఖచ్ఛితంగా సమయపాలన పాటించడం అవసరం అన్నారు.

జీరో వయోలెన్స్.. జీరో రీ పోల్ నినాదం తో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించడం లో ఎన్నికలను సమన్వయంతో, అంకిత భావంతో పనిచేస్తే మాత్రమే సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ సంఘటనలు జరిగే అవకాశం ఉందో ముందుగా గుర్తించి అక్కడ ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సాధ్యం అవుతుందని అన్నారు. అదే విధంగా రీ పోల్ జరుగకుండా ఖచ్చితమైన కార్యాచరణ విషయంలో ప్రణాళికా సిద్దం చేసుకోవడం ముఖ్యం అన్నారు. ఎన్నికల ఓటింగు ప్రక్రియలో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురైతే ఎటువంటి అడుగులు వేసి అటువంటి పరిస్థితి సమర్థవంతంగా అమలు చెయ్యగలమో అధికారులుగా మీ పనితీరు చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందనీ అన్నారు.

జిల్లా ఎస్పీ పి. జగదీష్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా విధులను నిర్వర్తించడం ముఖ్యం అన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన కేసులకు సంబంధించి సమగ్రవివరాలు అందజేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఉపయోగించే విడియో వాహనాలకు సెక్షన్ 52 ప్రకారం ఖచ్ఛితంగా ముందస్తు అనుమతి పొందాలని సూచించారు.

ఈ సమావేశంలో నోడల్ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *