రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి పరీక్షలకి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందనీ, జిల్లాలోనీ 137 పరీక్షా కేంద్రాలలో మొత్తం 29990 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. సోమవారము నుంచీ పరిక్షల నిర్వహణా కోసం అన్నీ ఏర్పాట్లు చేసే క్రమంలో అన్నీ సమన్వయ శాఖల తో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశామన్నారు.
పరీక్ష షెడ్యూల్ వివరాలు తెలియ చేస్తూ 18-03-2024 నుండి 30-03-2024 వరకు ఉదయం 10 నుంచి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి ఉ.9.30 వరకు పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించడం జరుగుతుందనీ అన్నారు. ఉదయం 10 గంటల తరువాత అనుమతించడం జరుగదనీ, కావున విద్యార్దులు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కోరారు.
ప్రభుత్వ స్కూల్స్ ద్వారా రెగ్యులర్ విద్యార్థులలో బాలురు 12112 మంది, బాలికలు 11569 మంది మొత్తం 23681 హజరు కానున్నట్లు తెలిపారు. ప్రైవేట్ గా బాలురు 3651 మంది, బాలికలు 2658 మంది మొత్తం 6309 మంది పరీక్షకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నిర్వహణ వారీగా పరీక్షా కేంద్రాలు: ఏడు ప్రభుత్వ స్కూల్, 75 జెడ్పీ హై స్కూలు, 16 మునిసిపల్ స్కూల్స్, 32 ప్రైవేట్ స్కూల్స్., 3 ఎయిడెడ్ పాఠశాలలు , 2 ఏపి సాంఘిక సంక్షేమ వసతి గృహల స్కూల్స్ , 2 ఎపి గురుకుల పాఠశాలలో పరీక్షలకి ఏర్పాట్లూ పూర్తి చేశా మన్నారు. పరీక్షలకు అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు