Breaking News

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయం: పెంచల కిషోర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం అని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డి.ఆర్.ఓ హాజరై పొట్టి శ్రీరాములు గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగఫలమే మన తెలుగు రాష్ట్రం అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం, స్ఫూర్తి దాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జయరాములు, బిసి సంక్షేమ శాఖ అధికారులు జ్యోత్స్న, బిసి హాస్టల్ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *