-ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్ష నిర్వహణ కు ఏర్పాట్లు పూర్తి: జిల్లా రెవెన్యూ అధికారి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 17తేదీన (నేడు) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని పరీక్ష నిర్వహణకు సిసి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, ఎలక్ట్రానిక్ వాచీలు, గ్యాడ్జెట్స్ అనుమతి లేదని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రూప్ -1 పరీక్షలు ఉ. 10:00 గంటల నుంచి మ. 12:00 గంటల వరకు పేపర్ -1, మ. 2.00 గం.ల నుండి సాయంత్రం 04.00 గం. ల వరకు పేపర్ -2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పేపర్ -1 పరీక్ష కొరకు ఉదయం 09:00 గంటల నుంచి 9.45 గంటల వరకు, పేపర్ -2 పరీక్ష కొరకు మధ్యాహ్నం 01.00 నుండి 1.45 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతి ఉంటుందని, కావున అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని అన్నారు. పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుందని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించ బడతాయని అన్నారు. గ్రూప్- 1 పరీక్షల నిర్వహణ కు తిరుపతి పట్టణ, రూరల్ పరిధిలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని 9,377 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 16 మంది లైజన్ ఆఫీసర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్ మరియు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, మొదలైనవి) తీసుకు రావాలని, గర్భిణీలకు, విభిన్న ప్రతిభావంతులైన అంధులకు గ్రౌండ్ ఫ్లోర్ నందు పరీక్ష రాసేలా ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల వద్ద తగినంత పోలీస్ బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందన్నారు. జిల్లాలో జరగబోయే ఏపిపిఎస్సి గ్రూప్ 1 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఏదేని సమాచారం కొరకు కంట్రోల్ రూం నంబర్లను 9000665565, 9676928804 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునని, పరీక్ష మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, ఓఆర్ఎస్ మెడికల్ కిట్ తో పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటుతో అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు.
Prajavartha Online Telugu News