-నిత్యాన్నదాన సేవ లో పాల్గొనటం పూర్వ జన్మ సుకృతం
-ఉడతా భక్తి సాయం
-డాక్టర్ ఎస్వీ రంగారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మలో భగవంతునికి సేవ చేసుకునే మహద్భాగ్యం దక్కటం కూడా భగవంతుని ఆజ్ఞగా భావిస్తున్నామని నిత్యాన్న దాన సేవలోవ పాలు పంచుకునే అవకాశం పూర్వ జన్మ సుకృతం మని ప్రముఖ వైద్యులు ఎస్వీ రంగారావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి దాతల సహకారంతో ఉడతా భక్తి సాయంగా మరడ నాగేంద్ర ఆధ్వర్యంలో సూర్యారావుపేటలోని ఆర్కే హాస్పిటల్ వద్ద నుంచి శనివారం బయలుదేరిన కూరగాయల వాహనానికి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు లక్షలాది మందికి అన్న ప్రసాదం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న బృహత్కార్యంలో తాము కూడా భాగస్వాములు కావడం భగవంతుని ఆజ్ఞగా భావిస్తున్నామన్నారు. సమాజంలో ఎంతోమంది వారి శక్తి మేరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నార న్నారు. అయితే సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే ఒక అద్భుతమైన అన్న ప్రసాద కార్యక్రమం మాత్రం గత మూడు దశాబ్దాలుగా నిరాఘాటంగా సాగటం, అటువంటి కార్యక్రమంలో తమవంటి సాధారణ భక్తులకు కూడా అవకాశం కల్పించడం, ఆ అవకాశం మాకు దక్కటం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. దివంగత ఆధ్యాత్మికవేత్త మండల కుటుంబరావు ప్రారంభించిన ఈ మహా యజ్ఞం కొనసాగింపులో తమ శక్తి మేరకు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. లక్షలాదిమంది ప్రతిరోజు దర్శించుకునేందు తిరుమలకు తరలి వస్తారన్నారు. భక్తులు స్వామివారి ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే భక్తుల కోసం పంపినట్టుగా భావించే స్థలంలో ఆహారం స్వీకరించేందుకు ప్రతి భక్తుడు ఇష్టపడతారన్నారు. ప్రతి ఒక్కరికి ఉండే మత విశ్వాసాల ఆధారంగా వారి వారి విశ్వాసాల ప్రకారం భగవదనుగ్రహం పొందడం కోసం చేసే సేవలలో ఆహారం పంపిణీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. కార్యక్రమం నిర్వాహకులు ఎం .నాగేంద్ర మాట్లాడుతూ 2004 లో ప్రారంభించిన ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో ఇప్పటి వరకు నగరం నుండి సుమారు 25 వేల టన్నులు కూరగాయలను టీటీడీకి వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా. త్రిపుర సుందరి దా. ఈశ్వర్ డా.రత్న పలువురు విద్యారంగ ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News