-బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ నేతలు
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్య సమస్యలతో చికిత్సలు చేయించుకున్న గుడివాడ పరిధిలోని 414 బాధిత కుటుంబాలకు మూడు కోట్ల 60 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విడుదలయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బాధిత కుటుంబ సభ్యులకు వైసీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశి భూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచడం సీఎం జగన్ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఆరోగ్య శ్రీలో లేని కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, ఇతర రాష్ట్రాల్లో చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందచేస్తుందని వైసిపి నాయకులు తెలియచేశారు. ఐదేళ్ల వైఎస్ఆర్సిపి పాలనలో ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో 1462 ఫైల్స్ సీఎం కార్యాలయానికి పంపగా, వెరిఫై అనంతరం 1311 ఫైల్స్ కు ఏడు కోట్ల 56 లక్షల, చేక్కులను బాధితులు పొందినట్లు వైఎస్ఆర్సిపి నాయకులు తెలియచేశారు. చేసిన మంచిని చూసి ప్రజలందరూ సీఎం జగన్ నాయకత్వానికి, మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కొండపల్లి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News