Breaking News

బీజేపీలోకి తరుణ్‌ కాకాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి బోటింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు తరుణ్‌ కాకాని బీజేపీలో చేరారు. శనివారం బెంజిసర్కిల్‌లోని స్వాతంత్య్ర సమరయోధుడు, తన తాతయ్య కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతులమీదుగా కండువా వేసుకుని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోధ్‌ థావడే సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తరుణ్‌ కాకాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు, పనితనానికి ఆకర్షితుడినై బీజేపీలో చేరానని, ఆదర్శ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ కాకాని వెంకటరత్నం వారసుడిగా కాకుండా వెంకటరత్నం రాజకీయ ఆశయాలకు వారసుడిగా మాత్రమే రాజకీయాలలో వస్తున్నానని తెలిపారు. పార్టీ బలోతపేతంతోపాటు, రానున్న ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం బీజేపీ శ్రేణులు, నాయకులు తదితరులు మాట్లాడుతూ బీజేపీలో యువ నాయకుడు కాకాని తరుణ్‌ చేరడం చాలా హర్షణీయమని, భవిష్యత్‌లో బీజేపీలో సముచితం స్థానం లభిస్తుందంటూ శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *