అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పదవి కాలం పూర్తయిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు సంస్థ సభ్యులు, కార్యాలయం సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. సోమవారం మంగళగిరి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మకు ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల లక్ష్మి, కమిషన్ సభ్యులు ఎస్.కె రుకియా బేగం, బూసి వినీత, గడ్డం ఉమా, మహిళా కమిషన్ సెక్రటరీ దాసరి శ్రీలక్ష్మి, మహిళా కమిషన్ రీజనల్ డైరెక్టర్ వై. శైలజ, విశ్రాంత అధికారిని ఆర్ సూయజ్, టీవీ శ్రీనివాస్, డాక్టర్ కే.వసుంధర, వసుంధర కార్యాలయం సిబ్బంది వాసిరెడ్డి పద్మను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడంలో మహిళా కమిషన్ సభ్యులు, కార్యాలయం సిబ్బంది అందించిన సహకారం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా సభ్యులకు, కార్యాలయం సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాలుతో మహిళా కమిషన్కు వచ్చే బాధితులకు భరోసా ఇవ్వడానికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా తన పదవి కాలంలో తగినంత న్యాయం చేయగలిగాను అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో మహిళా సాధికారత కోసం కృషి చేయడం జరిగిందన్నారు.