విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
SSC పబ్లిక్ పరీక్షలు మార్చి–2024, 18-03-2024 నుండి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్తో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 3473 కేంద్రాలలో 6,54,553 మంది నమోదవ్వగా 6,30,633 (96.35% ) మంది విద్యార్థులు హాజరయ్యారు.
విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, విజయవాడ లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ( గుణదల) మరియు FIIT JEE ఇంటర్నేషనల్ స్కూల్ ను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మరియు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు దేవానంద రెడ్డి, ZP హైస్కూల్ (బాలురు) పటమట, విజయవాడ, మరియు ZP హైస్కూల్, తాడేపల్లి, గుంటూరు లో మొదటి రోజు పరీక్షల నిర్వహణను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 1220 పరీక్షా కేంద్రాలను జిల్లా స్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు సందర్శించారు. SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 18-03-2024న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3743 పరీక్షా కేంద్రాలలో సాఫీగా మరియు ప్రశాంతంగా నిర్వహించబడింది.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …