విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నతాధికారులు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ను ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఏఈని అవినీతి శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వెహికల్ డిపోలో ఏసీబీ అధికారులు దాడులు సోమవారం నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ బంగారు రాజు ఆధ్వర్యంలో దాడి చేసి, డిపో ఇన్ఛార్జ్ ఏఈ ఈశ్వర్ కుమార్ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండె గా పట్టుకున్నారు. షేక్ సద్దాం హుస్సేన్ అనే కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలపన్ని, మన కార్యాలయంలో దాడి చేసి ఎసిపి అధికారులు ఏఈ ఆట కట్టించారు. వేస్ట్ మెటీరియల్ కు సంబంధించిన కాంట్రాక్ట్ ను మున్సిపల్ కమిషనర్ సద్దాం హుస్సేన్ కు అప్పగించారు. పనికి సంబంధించిన వర్క్ ఆర్డర్ తయారు చేయడం కోసం ఏఈ కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సద్దాం హుస్సేన్ విజయవాడలోని అవినీతి శేఖర్ అధికారులను సంప్రదించగా సోమవారం వల పన్ని లంచం తీసుకుంటుండగా ఏఈ ని పట్టుకున్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …