Breaking News

2024 – 25 ఆర్ధిక వార్షిక రుణ ప్రణాళికా రూ.13,201  కోట్లు

– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో  తూర్ఫు గోదావరి  జిల్లాకు సంబంధించి  వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి 13201  కోట్ల వరకు రుణ ప్రణాళికాతో ఈ డాక్యుమెంట్ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో 2024 – 25 ఆర్ధిక సంవత్సరం క్రెడిట్ ప్లాన్ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, 2024 – 25 అర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆయా ప్రాదాన్యత, తదితర రంగాల లో అవకాశాలు మేరకు అనుబంధ లింక్డ్ క్రెడిట్ ప్లాన్  సిద్ధం చేసి బ్యాంకర్లకు అంద చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకర్స్ 2024-25 ఆర్ధిక సంవత్సరం కి చెందిన  వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి రుణాలను విరివిగా  అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. కె.మాధవీలత  కోరారు. ఈ సందర్భముగా జరిగిన   జిల్లా బ్యాంకు సమాఖ్య సమావేశంలో నాబార్డ్ జిల్లా అధికారి డాక్టర్. వై.యస్. నాయుడు వివరిస్తూ, వివిధ బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్య సాధన వివరాలూ తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ డి ఎమ్ డివి ప్రసాద్, నాబార్డ్ డి డి ఎమ్ – డా వై ఎస్ నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి బి. సుజాత కుమారీ , డిసిసిబి , సిజిజి బ్యాంక్, ఇతర బ్యాంకు ప్రతినిధులు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *