Breaking News

అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా పాటించాలి

-ఏ ఆర్ వో – వై వి కే అప్పారావు

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు -2024 కోసం ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ మరియు నియమావళి ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) మేరకు నిర్దేశించిన సమాచారం తెలియ చేయుట జరుగు తున్నదని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి 51-రాజమండ్రి రూరల్ , రూరల్ తహసీల్దార్ వై వి కే అప్పారావు మంగళ వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల నియమావళిని అమలు పరుచుటకు అన్నీ రాజకీయ పార్టీలు మరియు అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారి 51-రాజమండ్రి రూరల్ వారికి సహకరించవలసినదిగా కోరి యున్నారు. ది.16.03.2024 నకు ముందు ఏర్పాటు చేయబడిన ప్రకటన బోర్డులు ఉన్న యెడల వాటిని వెంటనే తొలగింపవలయును. లేనిచో అటువంటి ప్రదర్శన బోర్డులన్నీ తొలగింపబడి, వాటిని తొలగించుటకు అయ్యే ఖర్చు సంబందిత రాజకీయపార్టీ వారి పేరట నమోదు చేయబడును. అనుమతి పొందిన ప్రదర్శన బోర్డుల యందు ఎదుటి వారి గౌరవమునకు భంగము కలిగించే విధముగా ప్రకటన చేయరాదు. పోలింగ్ బూతుకు 200 మీటర్ల పరిధి వరకు ఎటువంటి రాజకీయ ప్రదర్శన బోర్డులను ప్రదర్శించరాదు మరియు ఎటువంటి రాజకీయ పార్టీల ఆఫీసులు ఏర్పాటు చేయరాదు.రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం, రాజమండ్రి రూరల్ నందు  24 గంటలు  కాల్ సెంటర్ నెంబర్ 0883-2416005 అందుబాటులో ఉంచడం జరిగిందనీ, ఇందుకోసం మూడు షిఫ్టుల్లో సిబ్బంది నియమించామన్నారు. రూరల్ నియోజక పరిధిలో ముందస్తు అనుమతి పొందవలసిన వాటికి చెంది రిటర్నింగ్ అధికారి 51-రాజమండ్రి రూరల్ మరియు జాయింట్ కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి అనుమతి పొందవలయును

-అన్ని రాజకీయ పార్టీలు/ అభ్యర్ధులకు సంబందించిన ప్రకటనలు ప్రదర్శించుటకు
-ప్రకటన వివరము, ప్రకటన వేయు స్థలము, ప్రకటనల సంఖ్య వివరములతో
-రాజకీయ పార్టీలు/ అభ్యర్ధుల ప్రచార వాహనముల అనుమతిని వాహనముల సంఖ్య వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు సమర్పించి అనుమతి పొందవలయును.
-ఎన్నికల బహిరంగ ప్రచార సభల అనుమతి
-ప్రదర్శన ప్రకటనల యందు అసాంఘిక ప్రదర్శనలు ప్రదర్శించరాదు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *