రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు , రాజకీయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిదా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు సువిధా, ఎమ్.సి.సి., పి వో, ఎపివో, ఓపివో ల శిక్షణ కార్యక్రమం, పోస్టల్ బ్యాలెట్, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత, తొలుత ప్రిసైడింగ్ అధికారి, సహయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవడం లో నియామక ప్రక్రియ నుంచి ఓటు హక్కును వినియోగించుకునే వరకు వివిధ దశల్లో చెయ్యవలసిన విధి విధానాలపై సమగ్ర సమాచారం అందచేశారు.
సువిధా పోర్టల్ లో అనుమతి ఇచ్చే అంశాలు:
సువిధా పోర్టల్ కోసం పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో సువిధా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. సువిధా లో వొచ్చే ఆమేరకు రాజకీయ పార్టీలు, పోటీలో ఉండే అభ్యర్ధులు ముందస్తుగా సంభందిత రిటర్నింగ్ అధికారి కి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందనీ అన్నారు. సువిధా పోర్టల్ లో నేరుగా దరఖాస్తు చేసుకున్న వాటిని ఆర్వో లు సాధ్యమైనంత తొందరగా సహేతుకమైన విధానం అనుమతులు జారీ చెయ్యడం జరుగుతుందన్నారు. సువిధా పోర్టల్ లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉందని పేర్కొన్నారు.
* తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని తెరవడానికి
* సభ నిర్వహించడానికి అనుమతి కోసం దరఖాస్తు మరియు లౌడ్ స్పీకర్ లేకుండా సభ నిర్వహించడానికి
* లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేయడం కోసం
* స్ట్రీట్ కార్నర్ మీటింగ్ మరియు లౌడ్ స్పీకర్ కోసం
* ఇంటింటికి కాన్వాసింగ్ కోసం
* కరపత్రాల పంపిణీ కోసం
* ఊరేగింపు కోసం అనుమతి కోసం
* ర్యాలీ కోసం లౌడ్ స్పీకర్
* బ్యానర్ మరియు జెండాలను ప్రదర్శించడానికి దరఖాస్తు
* ఎయిర్ బెలూన్‌ల కోసం పర్మిషన్ టైప్ అప్లికేషన్‌ని ఎంచుకోండి
* హెలికాప్టర్ మరియు హెలిప్యాడ్ కోసం
* వాహన అనుమతి కోసం దరఖాస్తు
* వాహన అనుమతి కోసం దరఖాస్తు (జిల్లా పరిధిలో)
* లౌడ్ స్పీకర్ అనుమతితో వాహనం కోసం దరఖాస్తు
* వీడియో వ్యాన్ వినియోగం కోసం
అభ్యర్థి కోసం పూర్తి అసెంబ్లీ ప్రాంతానికి ఒక వాహనం
* అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ కోసం పూర్తి అసెంబ్లీ ప్రాంతం కోసం ఒక వాహనం
* పార్టీ/పార్టీ కార్యకర్త కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక వాహనం
సమావేశం లో రాజమండ్రీ రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రాజమండ్రీ అర్బన్ ఆర్వో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , సహయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్వో జి. నరసింహులు, రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి, గోపాలపురం ఆర్వో – (ఓఎన్జీసి ఎస్.డి.సి ) కె ఎల్ శివజ్యోతి, నిడదవోలు ఆర్వో (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I కొవ్వూరు.) ఆర్ వి రమణా నాయక్ , అనపర్తి ఆర్వో (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఎమ్. మాధురీ ,పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ముత్యాల శ్రీనివాస్, కే ఆర్ ఆర్ సి – ఎస్.డి.సి. ఆర్. కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్, పి. సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.