ధవళేశ్వరం,, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి డెల్టా సిస్టం పరిదిలో ఉమ్మడి తూర్పు గోదావరి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిది లో రబీ పంట కాలమునకు సాగు నీటికి ఎటువంటి ఇబ్బంది లేదని చీఫ్ ఇంజనీర్, గోదావరి డెల్టా సిస్టం ఆర్.. సతీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదిలో నీటి లభ్యత ప్రస్తుతం సమృద్ధిగ ఉన్నదని, .ఉభయగోదావరి జిల్లాల పరిధిలో సాగు నీటికి గాని, త్రాగునీటికి గాని, ఏవిధమయిన ఇబ్బంది లేదని తెలియ చేశారు. ఏ విధమైన ఇబ్బందులూ కలిగినచో ఈ దిగువ సూచించబడిన అధికారులను సంప్రదించ గలరని తెలియ చేశారు.
-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్, ధవళేశ్వరం :-9490741146
-ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్, ఏలూరు:- 9701375830
-చీఫ్ ఇంజనీర్,గోదావరి డెల్టా సిస్టం,ధవళేశ్వరం – 9652536333
Prajavartha Online Telugu News