-ఎన్నికల ప్రచారం కోసం ప్రైవేట్ భవనాలపై వాల్ రైటింగ్స్ అనుమతి లేదు
-జెండాలు / పోస్టర్లు ఏర్పాటు కి యజమాని అనుమతి తప్పని సరి
-ఆటోలు, ఇతర వాహనాల పై ఎటువంటి రాజకీయ పార్టీల ఫోటోలు, స్లొగన్స్ ఉండరాదు
– కలెక్టర్/డీ ఈ వో – మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మోడల్ ప్రవర్తనా నియమావళి కాలంలో ప్రభుత్వ రవాణా, పోస్టాఫీసులు, ప్రభుత్వ ఆసుపత్రులు/డిస్పెన్సరీల స్థలంలో ఏదైనా రాజకీయ ప్రకటన ఉంటే, వాటిని తీసి వేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం వెలగపూడి నుంచీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో ప్రకటనలు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, ఈ వి ఎమ్ రాండమైజేషన్ , ప్రతికూల వార్తలు, పివో, ఏపిఓ శిక్షణ, తదితర అంశాలపై సూచనలు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ లో భాగస్వామ్యం చేస్తున్న ప్రిసైడింగ్ అధికారి, సహయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ సిబ్బంది కి ముందస్తుగా శిక్షణ ఇచ్చే క్రమంలో కార్యచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఆమేరకు రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశనం చేశామన్నారు. ఈ వి ఎమ్ లకి చెందిన మార్గదర్శకాలు జారీ చేస్తూ, జిల్లాలో ఈ వి ఎమ్ మొదటి రాండమైజేషన్ మార్చి 28 వ తేదీన , పోలింగ్ పర్సన్ రాండమైజేషన్ – డ్రై రన్ మరియు మొదటి శిక్షణ పివో, ఏపివో, ఓపీవో లకి ఏప్రిల్ 4 న నిర్వహించాలని పేర్కొన్నారు.
ప్రచారం, ప్రకటన లపై ప్రధాన ఎన్నికల అధికారి చేసిన సూచనలపై ఆర్వో లకి సూచనలు, క్షేత్ర స్థాయిలో చేపట్టవలసిన వాటిపై జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. భద్రత, నిర్మాణ స్థిరత్వం కలిగిన ఉన్న పెద్ద హోర్డింగ్‌లు / కటౌట్ ఇళ్ళు పై ఏర్పాటు చేసే వాటినీ ముందస్తుగా ఆయా స్ధానిక సంస్థలు భద్రత పరమైన పరిశీలించి అనుమతులు జారీ చెయ్యాల్సి ఉంటుందన్నారు. రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, విమానాశ్రయం, వంతెనలు-రైల్వే మరియు రోడ్‌వేలు, ప్రభుత్వంలో స్థలాన్ని ఉపయోగించడం, బస్సులు, ప్రభుత్వం మరియు ప్రభుత్వ భవనాలు, విద్యుత్ మరియు టెలిఫోన్ స్తంభాలు, మున్సిపల్/స్థానిక సంస్థల భవనాలు, రాజకీయ ప్రకటనల కోసం వినియోగించడం నిషేధం అన్నారు. వ్యాపార సముదాయాలు వద్ద కేవలం ఆయా వ్యాపార ప్రకటనలు తప్ప రాజకీయ ప్రచారం కోసం వినియోగిస్తే ఉత్తర్వుల ఉల్లంఘనగా పరిగణించాలని స్పష్టం చేశారు. కార్లు , ఆటోలు, ఇతర వాహనాల పై ఎటువంటి రాజకీయ పార్టీల ఫోటోలు, స్లొగన్స్ ఉండరాదని , అటువంటి వాటి విషయంలో రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశం లో రాజమండ్రీ రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రాజమండ్రీ అర్బన్ ఆర్వో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , సహయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ , డిఆర్వో జి. నరసింహులు, రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి, గోపాలపురం ఆర్వో – (ఓఎన్జీసి ఎస్.డి.సి ) కె ఎల్ శివజ్యోతి, నిడదవోలు ఆర్వో (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I కొవ్వూరు.) ఆర్ వి రమణా నాయక్ , అనపర్తి ఆర్వో (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఎమ్. మాధురీ ,పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ముత్యాల శ్రీనివాస్, కే ఆర్ ఆర్ సి – ఎస్.డి.సి. ఆర్. కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్, పి. సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.