రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలలో పోటి చేసే అభ్యర్ధులు, రాజకీయా పార్టీలు విధిగా సువిధా పోర్టల్ ద్వారా ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు అయిన ఏన్.తేజ్ భరత్ తెలియ చేశారు. మంగళవారం రాత్రి జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో రాజకీయ ప్రతినిధులతో జరగబోవు ఎన్నికల మీద సూచనలు తెలుపుతూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భం గా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలని సజావుగా నిర్వహించే క్రమంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. సమావేశాలు నిర్వహించేందుకు, వాహనాలు వినియోగం సంభందించి ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రచారములో భాగంగా ప్రవేటు భవనాలకు చెందిన గోడలపై ఆయా యజమానుల అనుమతులు లేకుండా ఎటువంటి పార్టీ జెండాలు, పోటోలు ప్రదర్శించ రాదన్నారు.. అదే విధంగా గోడలపై ఎటువంటి రాతలు రాయకూడదని తేజ్ భరత్ తెలిపారు. అనుమతించిన ప్రాంతంలో ఆర్వో నుంచి అనుమతి తీసుకోవడం తప్పని సరి అన్నారు. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలలో, సంస్ధ లలో ఎటువంటి రాజకీయ ప్రకటనలను ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీలు ప్రతినిథులు, తహసీల్దార్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.