గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు తూర్పు, పశ్శిమ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకుల నుండి అందిన ఫిర్యాదులు, ఆర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై అందిన ఆర్జీల పరిష్కారంపై పశ్శిమ నియోజకవర్గ ఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాపై ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిదుల నుండి అందిన అర్జీలు, ఫిర్యాదులను వేగంగా పరిష్కారం చేయాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. పార్టీ కార్యాలయాలు, అభ్యర్ధుల కార్యాలయాల వద్ద ఎన్నికల సంఘం నిబందనల మేరకే ప్రకటనల బోర్డ్ లు, జెండాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 11 నుండి 18 వరకు తూర్పు, పశ్శిమ నియోజకవర్గాల్లో ఫారం 6, 7, 8 లు, షిఫ్టింగ్ దరఖాస్తులు 3,529 అందాయని వాటిని 2 రోజుల్లో పరిష్కారం చేయడానికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
సమావేశంలో ఏఈఆర్ఓలు వెంకట లక్ష్మీ, సునీల్, సూపరిండెంట్లు ప్రసాద్, పద్మ, సెక్టోరల్ అధికారి శ్రీధర్, రాజకీయ పార్టీలైన వైఎస్సార్సీపి నుండి డి.జాని బాబు, టిడిపి నుండి ఓంకార్, బిఎస్పి నుండి సిహెచ్.వాసు, అమ్ ఆద్మీ నుండి సేవకుమార్, కాంగ్రెస్ నుండి జాని భాష, డిప్యూటీ తహసిల్దార్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …